నిజాన్ని ఆపలేమనే విషయం టీడీపీ వాళ్లు తెలుసుకుంటారు!


నిజాన్ని ఆపలేమనే విషయం టీడీపీ వాళ్లు తెలుసుకుంటారు!

నిజాన్ని ఆపలేమనే విషయం టీడీపీ వాళ్లు తెలుసుకుంటారు!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఎవరూ ఆపలేరని రాంగోపాల్ వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టైటిల్‌లోనే ఇది లక్ష్మీపార్వతి దృష్టి నుంచి చిత్రీకరించిన ఎన్టీఆర్ బయోపిక్ అని తెలుస్తున్నా, ప్రధానంగా లక్ష్మీపార్వతి కథనే చెప్పినట్లు యూనిట్ వర్గాల సమాచారం.

పైగా చంద్రబాబును పూర్తి స్థాయి విలన్‌గా, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని సైడ్ విలన్లుగా చిత్రీకరించినట్లు విడుదల చేసిన రెండు ట్రైలర్లను బట్టి అర్థమైపోతోంది. “వాడూ, నా పిల్లలూ కలిసి నన్ను వెన్నుపోటు పొడిచారు” అని ఎన్టీఆర్ అన్న డైలాగ్ సైతం ఇదే చెబుతోంది.

కాగా ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున మార్చి 22న ఈ సినిమా విడుదల సందేహంలో పడనున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వర్మ స్పందించారు.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చెడు కోణంలో చూపించిన కారణంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆపమని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ వాళ్లు నరకంలో ఉన్న వాళ్లెవరూ నిజాన్ని ఆపలేరనే విషయం తెలుసుకోవాలి” అని తన ట్విట్టర్ పేజీలో రాసుకున్నారు.

టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ను కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆపాల్సిందిగా ఫిర్యాదు చేశారని తన్ ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్న దాన్ని తన వ్యాఖ్యలకు జోడించారు వర్మ.

ఏదేమైనా నిజం ఎప్పటికైనా బయటకు రావడం ఖాయమే అయినా, సమయానికి వస్తుందా, లేదా? అనేదే ప్రధానం కానున్నది. బంతి ఇప్పుడు సెన్సార్ చేతుల్లో, ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉంది. ఏమవుతుందో చూడాలి.

నిజాన్ని ఆపలేమనే విషయం టీడీపీ వాళ్లు తెలుసుకుంటారు! – actioncutok.com

Related articles: