‘ప్రేమ కథాచిత్రమ్ 2’ ఒరిజినల్లాగే హిట్టవుతుందా?


'ప్రేమ కథాచిత్రమ్ 2' ఒరిజినల్లాగే హిట్టవుతుందా?

‘ప్రేమ కథాచిత్రమ్ 2’ ఒరిజినల్లాగే హిట్టవుతుందా?

సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన ‘ప్రేమ కథాచిత్రమ్’ ఘన విజయం సాధించింది. హారర్ కామెడీలకు ద్వారాలు తెరిచింది. ఆ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ప్రభాకరరెడ్డి డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమాని నిర్మించిన ఆర్.పి.ఎ. క్రియేషన్స్ సంస్థ ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్ నిర్మించింది.

ఉగాదికి అంటే ఏప్రిల్ 6న ‘ప్రేమ కథాచిత్రమ్ 2’ విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా హరికిషన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే ఒరిజినల్‌లోని ప్రధాన పాత్రధారులెవరూ సీక్వెల్‌లో లేరు. హీరో హీరోయిన్లుగా సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని (‘జంబ లకిడి పంబ’ ఫేమ్) నటించగా, నందితా శ్వేత నెగటివ్ ఛాయలున్న డెవిల్ రోల్‌లో కనిపించబోతోంది.

అంటే ఒరిజినల్‌లో ఒక నందిత నటిస్తే, సీక్వెల్‌లో ఇంకో నందిత నటించిందన్న మాట. అంతే కాదు, ఒరిజినల్‌లో హీరో పాత్ర పేరు సుధీర్ కాగా ఇందులోనూ ఆ పాత్ర పేరును కొనసాగించారు.

‘ప్రేమ కథా చిత్రమ్’ విజయం సాధించడంలో సుధీర్ బాబు, నందితల ప్రేమ కథతో పాటు సప్తగిరి, ప్రవీణ్ చేసిన అల్లరి కామెడీ పాత్ర కూడా చాలానే ఉంది. చూస్తుంటే సీక్వెల్‌లోనూ కామెడీకి పెద్ద పీటే వేసినట్లు కనిపిస్తోంది. ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్, కృష్ణతేజలపై కామెడీ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లున్నాయి. నందితా శ్వేత పాత్ర, కామెడీ పండితే ఈ సీక్వెల్ సైతం హిట్టవుతుందనడానికి సందేహం అవసరం లేదు.

‘ప్రేమ కథాచిత్రమ్ 2’ ఒరిజినల్లాగే హిట్టవుతుందా? | actioncutok.com

You may also like: