నేను నోరు తెరిస్తే చాలామంది ఇమేజ్ దెబ్బతింటుంది


నేను నోరు తెరిస్తే చాలామంది ఇమేజ్ దెబ్బతింటుంది

కొద్ది రోజుల క్రితం, కైరళి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఒరు ఆడార్ లవ్’ (తెలుగులో ‘లవర్స్ డే’) డైరెక్టర్ ఒమర్ లులు తాను ప్రియా ప్రకాశ్ వారియర్‌తో మాట్లడ్డం లేదనీ, ఆ సినిమాలోని కేరెక్టర్ తెచ్చిన పాపులరిటీతో ఆమె చాలా మారిపోయిందనీ వెల్లడించాడు.

ఒమర్ లులు వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విరివిగా ప్రచారంలోకి రావడంతో తనకు సినీ జన్మనిచ్చిన దర్శకుడితోనే ఆమె అలా ప్రవర్తిస్తుండటంపై నెటిజన్లు ప్రియా ప్రకాశ్‌పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ మధ్యలో, ఈ విమర్శలకు జవాబన్నట్లుగా పాత కథలపై తానేమీ మాట్లాడననీ, తాను నోరు తెరిస్తే చాలామంది ఇమేజ్‌కు నష్టం కలుగుతుందంటూ స్పందించింది. అంతే కాదు, భవిష్యత్తులో ‘కర్మ’ మాట్లాడుతుందనీ, ఆ రోజులు ఎక్కువ దూరం లేవనీ కూడా చెప్పింది.

మొత్తానికి ఒమర్ లులుకు ప్రియా ప్రకాశ్ పరోక్షంగా ఇచ్చిన జవాబు నెటిజన్లను మెప్పించకపోగా, మరింత కోపాన్ని తెప్పించింది. దాంతో వాళ్లు ఆమె ఇన్‌స్టాగ్రాం పేజీలో నిర్దాక్షిణ్యంగా ఆమెపై దాడి చెయ్యడం మొదలుపెట్టారు. చాలామంది వ్యంగ్యంగా ఆమెను ‘హాలీవుడ్ తార ప్రియా ప్రకాశ్’ అంటూ సంబోధించడంతో ఆగకుండా, ఆమె కంటే ‘ఒరు ఆడార్ లవ్’లోని ఆమె సహనటి నూరిన్ షరీఫ్ మరింత ప్రతిభావంతురాలని కూడా వాదించారు.

ఇంకొంతమంది మరింత ముందుకెళ్లి మలయాళం చిత్రసీమలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక జోకర్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం తాను ఆస్వాదిస్తున్న పాపులారిటీకి కారణం కేవలం ఒమర్ లులు అయినప్పటికీ, క్రేజ్ వచ్చాక, తెలివిగా ఆయనను దూరం పెడుతోందని వాళ్లు విమర్శిస్తున్నారు

నేను నోరు తెరిస్తే చాలామంది ఇమేజ్ దెబ్బతింటుంది – ప్రియా ప్రకాశ్

You may also like: