క్విజ్: ‘దొంగరాముడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: 'దొంగరాముడు' సినిమా మీకెంతవరకు గుర్తుంది?
Savitri and ANR in Donga Ramudu

తెలుగు సినిమాకు సంబంధించిన సుప్రసిద్ధ నిర్మాణ సంస్థల్లో ఒకటైన అన్నపూర్ణ పిక్చర్స్ ఏర్పడిన సంవత్సరం 1955. దాని అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. ఆ బేనర్‌పై వచ్చిన తొలి సినిమా ‘దొంగరాముడు’ అధ్భుత విజయాన్ని సాధించి, సంస్థకు గట్టి పునాది వేసింది. విఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి జంటగా నటించారు.

క్విజ్: ‘దొంగరాముడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది?

1. ‘దొంగరాముడు’ సంగీత దర్శకుడు

ఎ) అద్దేపల్లి రామారావు   బి) పెండ్యాల నాగేశ్వరరావు   సి) భీమవరపు నరసింహారావు

2. ఈ సినిమాతో విలన్‌గా పరిచయమైన నటుడు

ఎ) ఆర్. నాగేశ్వరరావు   బి) నాగభూషణం   సి) రాజనాల

3. ‘దొంగరాముడు’ సంభాషణల రచయిత

ఎ) తాపీ ధర్మారావు   బి) డి.వి. నరసరాజు   సి) ఆరుద్ర

4. సినిమా షూటింగ్ జరిగిన స్టూడియో

ఎ) ఏవీఎం స్టూడియో   బి) మోడరన్ థియేటర్ స్టూడియో   సి) వాహినీ స్టూడియో

5. అక్కినేని నాగేశ్వరరావు, ఆర్. నాగేశ్వరరావు మధ్య ముష్టియుద్ధాన్ని కంపోజ్ చేసిన ఫైటర్

ఎ) స్టంట్ సోము   బి) దండమూడి రాజగోపాల్   సి) రాఘవులు

6. “భలే తాత మన బాపూజీ” గీత రచయిత

ఎ) సముద్రాల రఘవాచార్య  బి) కొసరాజు  సి) వెంపటి సదాశివబ్రహ్మం

7. సావిత్రి పాత్ర పేరు

ఎ) జానకి  బి) లక్ష్మి  సి) సీత

జవాబులు: 1. పెండ్యాల నాగేశ్వరరావు 2. ఆర్. నాగేశ్వరరావు 3. డి.వి. నరసరాజు 4. వాహినీ స్టూడియో 5. రాఘవులు 6. సముద్రాల రాఘవాచార్య 7. సీత

క్విజ్: ‘దొంగరాముడు’ సినిమా మీకెంతవరకు గుర్తుంది? – actioncutok.com

More Quiz: