రాంగోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ ఎందుకు చెయ్యరు?


రాంగోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ ఎందుకు చెయ్యరు?

రాంగోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ ఎందుకు చెయ్యరు?

సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మకు మద్దతు లభించింది. విప్లవ, అభ్యుదయ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఆయనకు నైతిక మద్దతు పలికారు. ఆయన సినిమాను సెన్సార్ చెయ్యకుండా జాప్యం చేస్తోన్న సెన్సార్ బోర్డ్ పనితీరును దుయ్యబట్టారు. సీనియర్ సినీ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి అతిథిగా పాల్గొని శ్రీదేవికి నివాళులర్పించారు. ఇవాళ ఆమె బతికుంటే సెన్సార్ బోర్డ్ పనితీరు చూసి కన్నీళ్లు పెట్టుకొనేవారన్నారు.

“వైజయంతి మాల, రేఖ, జయప్రద, శ్రీదేవి దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకెళ్లి ఏలారు. మిగతా ముగ్గురిలోని లక్షణాలన్నీ ఒక్క శ్రీదేవిలో ఉన్నాయి. ఆమె చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, దేశమే కాకుండా యావత్ ప్రపంచమే కన్నీళ్లు కార్చింది. దటీజ్ గ్రేట్‌నెస్ ఆఫ్ శ్రీదేవి.

నా సినిమా సెన్సార్ పనుల కోసం బొంబాయి వెళ్లాను. ఆ మహాతల్లి ఎంత గొప్పదంటే ఇక్కడ్నుంచి ఏ తెలుగువాడు అక్కడకు వెళ్లినా, ఎవర్నైనా కలవాలంటే, తన పీఏను పంపించి సహాయం చేసేది. ఆవిడది మంచి మనసు. నన్ను చూసింది. “ఏవండీ బాగున్నారా?” అనడిగింది. “బాగున్నా మేడం” అన్నాను. “ఏవిటిలా వచ్చారు?” అనడిగింది. సెన్సార్ పనిమీద వచ్చానన్నాను.

“మీరు విప్లవ సినిమాలు భలే తీస్తారే. చాలా గొప్పగా ఉంటాయండీ. నాక్కూడా విప్లవ సినిమా తియ్యాలని ఉందండీ” అందావిడ. ఇవాళ ఆ శ్రీదేవి గారుంటే.. ఇవాళ సెన్సార్ బోర్డులో ఏవైతే జరుగుతున్నాయో అవి చూసి ఆవిడ నిజంగా కన్నీళ్లు పెట్టుకొనేది.

ఎంత దుర్మార్గమండీ. రాంగోపాల్ వర్మగారు ఒక సినిమా తీశారు. ఆ సినిమా సెన్సార్ చెయ్యారాండీ. ఎవరో వచ్చి కేసుపెడితే సినిమా ఆపేస్తారాండీ. వాటీజ్ దిస్? నేనో సినిమా తీశానడీ. దాన్ని సెన్సార్ చెయ్యరండీ. దానికోసం ట్రిబ్యునల్‌కు వెళ్లాలాండీ. వాటీజ్ గోయింగ్ ఆన్? సినిమా ఇండస్ట్రీ అంతా దీన్ని ఖండించాలి” అని అన్నారు నారాయణమూర్తి.

రాంగోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ ఎందుకు చెయ్యరు? | actioncutok.com

You may also like: