చంద్రబాబుకు జై కొట్టిన ఆర్జీవీ!


చంద్రబాబుకు జై కొట్టిన ఆర్జీవీ!

చంద్రబాబుకు జై కొట్టిన ఆర్జీవీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాంగోపాల్ వర్మ జై కొట్టారు. ఆశ్చర్యమనిపిస్తోందా! నిజమే. గురువారం వర్మ చేసిన ఒక ట్వీట్ ఇది నిజమనే చెబుతోంది. అగస్త్య మంజుతో కలిసి తను డైరెక్ట్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని మార్చి 29న విడుదల చేస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

నిజానికి మార్చి 22న విడుదల చేయాలని ఆయన భావించగా, ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ సకాలంలో ఆ సినిమాని పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో ఆ తేదీన సినిమా విడుదల చేయడానికి వీల్లేకపోయింది. దాంతో విడుదలను ఒక వారం పోస్ట్‌పోన్ చేశారు వర్మ.

ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుంచి ఆ సినిమాకు క్లియరెన్స్ రాలేదు. ఈలోగా చంద్రబాబునాయుడు వల్ల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ అవుతుందనే నమ్మకం తనకు 100 శాతం ఉన్నదంటూ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది.

అధికారం దుర్వినియోగం చేయకుండా తన ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆపుతారనీ, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా రౌడీ మూకలకు అడ్డుకట్ట వేస్తారనీ, అందువల్లే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలవుతుందనీ ఆయన పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా “జై చంద్రబాబునాయుడు”, “జై ఎన్టీఆర్” అని తన పోస్ట్‌కు ముక్తాయింపునిచ్చారు వర్మ.

ఆయన మాటల వల్ల ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనీ, రౌడీమూకలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందనీ ఆయన చెప్తున్నారన్న మాట. అయితే అవి జరక్కుండా చంద్రబాబు చూస్తారనే నమ్మకం తనకు ఉందని వర్మ అంటున్నారు. ఆయన మాటలకు అంతరార్థం ఏమిటో రానున్న రోజుల్లో స్పష్టం కావచ్చు.

చంద్రబాబుకు జై కొట్టిన ఆర్జీవీ! | actioncutok.com

You may also like: