ఎన్టీఆర్‌కు వర్మ ‘గొంతుపోటు’!


ఎన్టీఆర్‌కు వర్మ 'గొంతుపోటు'!
Viswa and Vijay Kumar

ఎన్టీఆర్‌కు వర్మ ‘గొంతుపోటు’!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ఏరియాల్లో శుక్రవారం విడుదలైంది. అగస్త్య మంజుతో కలిసి రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచారార్భాటంతో తెలంగాణలో మొదటి రోజు బాగానే ప్రేక్షకుల్ని రాబట్టగలిగింది కానీ సినిమా నాసిరకంగా ఉందనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంచితే సినిమాలో ఎన్టీఆర్ తన సొంత గొంతును వినిపించలేదనే విషయం బయటకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రాంగోపాల్ వర్మే బయటపెట్టారు. ఎన్టీఆర్ పాత్రను ఏలూరుకు చెందిన రంగస్థల నటుడు విజయకుమార్ పోషించిన విషయం మనకు తెలుసు. కానీ సినిమాలో ఆయన తన డైలాగులను తను చెప్పలేదు. ఆయన పాత్రకు మరొకరితే డబ్బింగ్ చెప్పించారు. ఆ డబ్బింగ్ చెప్పింది గీత రచయితగా సుపరిచితుడైన విశ్వా.

అంటే తెర మీద కనిపించిన ఎన్టీఆర్ తన సొంత గొంతును వినిపించకుండా ఇంకొకరి గొంతును అరువు తెచ్చుకున్నారు. సాధారణంగా పరభాషా నటులకు డబ్బింగ్ చెప్పడం సాధారణ విషయమే. ఈ మధ్య కొంత మంది పర భాషా నటులు సైతం మరొకరి డబ్బింగ్‌పై ఆధారపడకుండా తమ వాయిస్ వినిపించడానికే ఇష్టపడుతున్నారు.

అలాంటిది ఎన్టీఆర్ పాత్రధారి.. ఒక తెలుగు నటుడైనప్పటికీ.. సొంత గొంతును వినిపించే అవకాశం ఇవ్వకుండా ఆ గొంతును నొక్కిపట్టి, విశ్వా గొంతును వినిపించడంపై విశ్లేషకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వాళ్లు ‘గొంతుపోటు’గా అభివర్ణిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు వర్మ ‘గొంతుపోటు’! | actioncutok.com

You may also like: