రానాకి పంచ్ డైలాగ్స్ రావు!


రానాకి పంచ్ డైలాగ్స్ రావు!

రానా దగ్గర చాలా ఆసక్తికర రహస్యాలున్నాయి. వాటిలో అతనికి సంబంధించినవే కాకుండా తోటి నటులకు చెందినవీ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పంచుకున్నాడు రానా.

ప్రభాస్ దగ్గర నేర్చుకున్నది

“ప్రబాస్ దగ్గర నేను నేర్చుకొన్న మొదటి విషయం ఓర్పు. ఇంకెవరికీ సాధ్యం కానంత ఓర్పు అతనిలో ఉంది. ‘బాహుబలి’కి అతనే స్తంభం. దాన్నెవరూ ప్రశ్నించలేరు. ఏ విషయంలోనూ డైరెక్ట్‌ని కొశ్చన్ చేసేవాడు కాదు. ఆ సమయానికే అతను చాలా పెద్ద స్టార్. ‘మిర్చి’తో పాటు మరికొన్ని పెద్ద హిట్స్ తర్వాత ‘బాహుబలి’ చేశాడు.

ఆ సినిమా చేసిన ఐదేళ్ల కాలంలో అతను ఎన్ని సినిమాలు చేసుండవచ్చో మీరు ఊహించగలరా! ఆ కాలంలో అతనెంత సంపాదించి ఉండొచ్చు? ఒక్క సెకను కూడా దాని గురించి అతనడగలేదు. ఆ చిత్తశుద్ధి, అంకితభావం, సహనం వల్లనేనేమో అతనంటే నాకు చాలా ఇష్టం.”

ఎప్పుడైనా రానా ఫెయిలయ్యాడా?

“నేను టెన్త్ క్లాస్ తప్పాను.”

రిపోర్ట్ కార్డ్‌లో మార్కులు మార్చేశాడు

“ఒక్కసారి కాదు, రెండు మూడేళ్లు నేను మార్కులు మార్చేశాను. అది మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయినప్పటి మాట. మీకు మీ గార్డియన్ ఉన్నట్లే, నాకు మా తాత (రామానాయుడు) గార్డియన్. ఆయన దేన్నీ పెద్దగా పట్టించుకొనేవాడు కాదు. నాకు మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా, వాటిని మార్చడానికి అనుమతించేవాడు.

నేనేం నేర్చుకుంటానన్నా సరేననేవాడు. నేను ఎక్కువగా చదువుకుంటున్నానన్నట్లు చెప్పేవాడు. ప్రత్యామ్నాయ సామర్థ్యాలు నేర్చుకొనే విషయంలో ఆయన నాకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఇప్పటికీ నాకది ఉపయోగపడుతూనే ఉంది.”

రానా చెయ్యలేనివి

“నేను డాన్స్ చెయ్యలేను. పంచ్ డైలాగ్స్ చెప్పలేను. పంచ్‌కి పంచ్ వేసి నవ్వించడం నాకు రాదు. కాబట్టి, నటన విషయంలో, కొన్నింటిని నేను చెయ్యలేను.”

సినిమా సెట్స్ మీదే పెరిగాడు

“ఆ కాలంలో, గడపడానికి ప్లేసే ఉండేది కాదు. నా స్కూల్లోనే ఎక్కువగా గడపేవాడ్ని. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా. అది 200 ఎకరాల్లో విస్తరించిన స్కూలు. క్లాస్‌రూం కంటే బయటే ఎక్కువగా ఉండేవాడ్ని. కాబట్టి, అదొక మంచి అనుభవం.

సినిమా షూటింగుల కోసం కట్టించిన ఒక బిల్డింగ్‌లో గడిపేవాడ్ని. అలాంటి ఇంట్లో ఉండేవాళ్లమన్న మాట. మేం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటే, కింద ఫ్లోర్‌లో షూటింగ్స్ జరిగేవి. రోజూ స్కూల్‌కి వెళ్లేముందు సినిమా సెట్స్ మీదే బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడ్ని. అంటే, నేను నిజానికి నేను పెరిగింది సినిమా సెట్స్ మీదే.”

రానా ఎమోషనల్ పర్సన్

“ఇది కేవలం క్షణికం. నటులకు ఇది పెద్ద సమస్య. సహజంగానే భావోద్వేగాలు చాలా హెచ్చుగా ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలం క్షణికం. ఒక క్షణం తర్వాత అది మారిపోతుంది. దాని స్థానంలోకి వేరే ఉద్వేగం వస్తుంది.

సినిమాలు చూసేప్పుడు తెగ ఏడ్చేస్తుంటాను. సినిమాతో కనెక్టైతే, మనకు తెలీకుండానే ఏడ్చేస్తాం. నిజ జీవితంలో నేనెప్పుడూ ఏడవలేదు. కానీ సినిమాల విషయానికొస్తే, అది వేరు.”

రానాకి పంచ్ డైలాగ్స్ రావు! – actioncutok.com

You may also like: