రవితేజ ‘తెరి’ రీమేక్ ఆగిపోలేదు!


రవితేజ 'తెరి' రీమేక్ ఆగిపోలేదు!

రవితేజ ‘తెరి’ రీమేక్ ఆగిపోలేదు! – actioncutok.com

విజయ్ హీరోగా మూడేళ్ల క్రితం తమిళంలో వచ్చిన ‘తెరి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేశారు కానీ, ఇక్కడ ఆడలేదు. అయినప్పటికీ ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి హీరో రవితేజ, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ సిద్ధమయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టింది. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత హఠాత్తుగా ఆపేశారు. కారణాలేమిటనే విషయంపై ఎవరూ నోరు మెదపలేదు.

ప్రస్తుతం రవితేజ 1980ల నేపథ్యంలో నడిచే కథతో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం దాని చిత్రీకరణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ ‘తెరి’ రీమేక్ తెరపైకి వచ్చింది. ఏప్రిల్ నుంచి ఆ సినిమా షూటింగ్ కొనసాగుతుందని తెలియవచ్చింది. అంటే ఏక కాలంలో ఈ రెండు సినిమాల్నీ రవితేజ్ చేయనున్నాడు.

‘తెరి’ రీమేక్‌లో కాజల్ అగర్వాల్, కేతరిన్ ట్రెసా నాయికలుగా ఇదివరకు ఎంపికయ్యారు. ఆ ఇద్దరు తమ పాత్రల్ని నిలబెట్టుకున్నారా, మరెవరైనా వాళ్ల స్థానాల్లోకి వచ్చారా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. విజయదశమికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు సంకల్పించినట్లు సమాచారం.

రవితేజ ‘తెరి’ రీమేక్ ఆగిపోలేదు! – actioncutok.com

You may also like: