ఎన్టీఆర్ అంత బలహీనుడా?

ఎన్టీఆర్ అంత బలహీనుడా?
‘అసలు కథ’ చెబుతానంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎప్పటిలా తాను చెప్పదలచుకున్న కథనే చెప్పాడు రాంగోపాల్ వర్మ. ఆయన మాటల్ని జనం నమ్మడం ఎప్పుడో మానేసిన విషయం తెలిసిందే. తానేమీ ప్రేక్షకుల్ని తన సినిమా చూడమని చెప్పట్లేదనీ, చూడాలనుకునేవాళ్లు చూస్తారనీ గతంలో ప్రేక్షకుల్ని చులకన చేసి మాట్లాడిన వర్మకు ‘ఆఫీసర్’ సినిమాని తిరస్కరించడం ద్వారా చక్కని సమాధానం చెప్పారు జనం.
ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీ పార్వతిని గొప్ప మనసున్న మనిషిగా వర్మ చిత్రించడం ఆయన ఇష్టం. కానీ ఎన్టీఆర్ను బలహీన మనస్కుడిగా ఆయన చిత్రించిన తీరు అభ్యంతరకరం. తన చరిత్రను రాయడానికి వచ్చిన ఒక వివాహిత పట్ల, భార్యను కోల్పోయిన వ్యక్తి అనురాగం ప్రదర్శించడానికి తాపత్రయపడుతున్నట్లు చిత్రించి, ఆయనను ఒక బలహీన మనస్కుడిగా ప్రొజెక్ట్ చేశాడు వర్మ.
తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటిన మహానాయకుడిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన ఎన్టీఆర్ అన్ని విషయాల్లోనూ.. అది వ్యక్తిగతం కానీ, రాజకీయపరమైంది కానీ.. లక్ష్మీపార్వతిపై ఆధారపడ్డారన్నట్లు చూపించి ఆయన వ్యక్తిత్వాన్ని అపహాస్యం పాలు చేశాడు వర్మ.
ఎన్టీఆర్ అంత బలహీనుడా? | actioncutok.com
You may also like: