ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!


ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!

ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!

యస్.యస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ (వర్కింగ్ టైటిల్)లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ పోషిస్తోన్న పాత్రలేమిటో వెల్లడయ్యాయి. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా వాళ్ల పాత్రలతో రూపొందిస్తోన్న కల్పిత కథ అని రాజమౌళి చెప్పారు.

గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించిన పలు వివరాలు వెల్లడించారు. అజయ్ దేవ్‌గణ్, అలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు.

ఆడియెన్స్ సినిమాకి వచ్చే ముందు ఆ సినిమాలో ఏం చూడబోతున్నాం, ఎలాంటి కథను చూడబోతున్నాం, ఆ సినిమా ఎలాంటి అనుభవాన్ని మనకు ఇవ్వబోతోంది అనే అంచనాతో వస్తారనే విషయాన్ని నేను చాలా నమ్ముతాను. కాబట్టి ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాను. ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నానో ముందే చెప్పడానికి ప్రయత్నిస్తాను.

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకొస్తే ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం కాబట్టి ఇదేం సినిమా అని ఇంతదాకా చెప్పలేదు.

1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. అది మనకు తెలిసిన విషయమే. ఆయన ఇంగ్లీషుతో పాటు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యోగాలో నిష్ణాతులు. యుక్త వయసులోనే ఇల్లొదిలి వెళ్లిపోయారు. రెండు మూడేళ్ల పాటు ఇక్కడ లేరు. ఎక్కడికెళ్లారో, ఏం చేశారో తెలీదు. తిరిగొచ్చాక ఆయన గిరిజన సంక్షేమం కోసం స్వాతంత్ర్యోద్యమం మొదలు పెట్టారు.

అక్కడ్నుంచి ఆయన వచ్చిన విధానం, ఏ విధంగా పోరాడారు, పోలీస్ స్టేషన్‌లపై దాడులు చెయ్యడం, గన్స్ తీసుకోవడం, జనాలను ఉత్తేజపర్చడం.. మనకు తెలిసిందే. తర్వాత ఆయనకు నిశ్చితార్థం జరగడం, బ్రిటిషర్ల చేతుల్లో చనిపోవడం కూడా మనకు తెలుసు.

ఆయన పుట్టిన నాలుగేళ్లకే ఉత్తర తెలంగాణా ఆదిలాబాద్‌లో కొమరం భీం పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా ఇల్లొదిలి వెళ్లిపోయారు. వెళ్లాక ఏం జరిగిందనే కథ మళ్లీ ఎవరికీ తెలీదు. వెళ్లేటప్పుడు ఆయన నిరక్షరాస్యుడు. చదువుకున్నవాడుగా తిరిగొచ్చారు.

ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఆయన కూడా గిరిజన సంక్షేమం కోసం, వాళ్ల స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అల్లూరి ఎలా ఫైట్ చేశారో భీం కూడా అలాగే ఫైట్ చేశారు. గొరిల్లా పోరాటం, పోలీస్ స్టేషన్లపై దాడి చెయ్యడం, గన్స్ తీసుకోవడం, ప్రజల్ని ఉత్తేజపర్చడం, బ్రిటిషర్ల చేతుల్లోనే చనిపోవడం.. అన్నీ అలాగే జరిగాయి.

ఆ ఇద్దరూ దాదాపు ఒకే కాలంలో పుట్టడం, ఒకే కాలంలో వెళ్లిపోవడం, వెళ్లాక ఏం జరిగిందో ప్రపంచానికి తెలీకపోవడం, తిరిగొచ్చాక ఒకే విధానంలో బ్రిటిషర్లపై తిరుగుబాటు చెయ్యడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ అనిపించింది. నా సినిమాకి కథకు వాళ్ల కథే స్ఫూర్తి.

చరిత్రలో ఎప్పుడూ కలవనివాళ్లు, ఒకరికొకరు సంబంధం లేని వీరులు.. నిజంగా మనకు తెలీని కాలంలో వాళ్లు కలిసుంటే, ఒకరికొకరు స్ఫూర్తి అయ్యుంటే, వాళ్ల మధ్య ఏర్పడిన స్నేహం ద్వారానే బ్రిటిషర్లపై పోరాడుంటే.. అనే పాయింట్ నాకు చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. దాన్నే మా కథగా మలచుకున్నాం.

మనకు తెలిసిన కథను ఇందులో చెప్పడం లేదు. మనకు తెలియనిదాన్ని పూర్తిగా ఊహించి రాసిన కథ. అంటే ఇది ఇద్దరు నిజమైన నాయకుల కల్పిత కథ. చాలా పెద్ద స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. చిన్న స్థాయిలో తియ్యడం నాకు రాధు. పెద్ద స్థాయిలోనే ఆలోచించి తీస్తుంటా.

1920ల ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి దాని కోసం చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఏముండేది, జీవిత విధానం ఎలా ఉండేది, వస్త్రధారణ ఎలా ఉండేది, జనాలు ఎలా ఉండేవారు, మాట్లాడే విధానం ఎలా ఉండేది, వర్తకం ఎలా ఉండేది.. అనే విషయాలపై చాలా రీసెర్చి చేశాం. అందుకే ఈ సినిమా మొదలుపెట్టడానికి ఇంత కాలం పట్టింది.

ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!
శక్తిమంతమైన పాత్రలో అజయ్ దేవ్‌గణ్!

అంతా సిద్ధం చేసుకున్నాకే షూటింగ్ మొదలుపెట్టాం. ఇంత పెద్ద హీరోలున్న కథకు పెద్ద స్థాయి సపోర్టింగ్ ఆర్టిస్టులు అవసరం. ఒక స్ట్రాంగ్ రోల్ చెయ్యడానికి అజయ్ దేవ్‌గణ్ ఒప్పుకున్నారు. కలవాలని మెసేజ్ పెడితే కలవమన్నారు. ఆయనకు కేరెక్టర్ వివరించాను. వెంటనే డేట్లు ఎప్పుడు కావాలన్నారు. ఇచ్చారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఒక పవర్‌ఫుల్ కేరెక్టర్‌ను అజయ్ దేవ్‌గణ్ చేస్తున్నారు.

రాంచరణ్ జోడీగా అలియా భట్ నటిస్తోంది. బాంబే నుంచి వస్తుంటే ఆమెను ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. అప్పుడే రఫ్‌గా ఆమెకు కేరెక్టర్ గురించి చెప్పాను. ఏ పాత్రయినా సరే చేస్తానంది. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాం. తను చేయబోతున్న పాత్రకు ఎంతో ఎగ్జయిట్ అయ్యింది. అలాగే తారక్ పక్కన డైసీ ఎడ్గార్ జోన్స్ అనే అందమైన అమ్మాయి చేస్తోంది. సినిమాకు వెన్నెముక లాంటి పాత్రను సముద్రకని చేస్తున్నారు. ఒక మంచి కథకు మంచి సపోర్టింగ్ కేస్టింగ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్!

వర్కింగ్ టైటిల్ ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకుంటే, దాన్నే టైటిల్‌గా పెట్టమని అందరూ అడుగుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. అయితే దాన్ని టైటిల్‌గా ఎలా పెడతామని అనుకున్నాం. కాకపోతే అన్ని భాషల్లోనూ ‘ఆర్ ఆర్ ఆర్’ అనేది కామన్‌గా ఉంటుంది. దానికి ప్రతి భాషలోనూ ఒక కొనసాగింపు టైటిల్ ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో.. ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ ఉంటుంది. తెలుగు కొనసాగింపు టైటిల్ తర్వాత ప్రకటిస్తాం. దానికి ఇప్పటికే చాలా సూచనలు వస్తున్నాయి.

అల్లూరి సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి కేరెక్టర్‌ను చరణ్ చేస్తున్నాడు.

ఆర్ ఆర్ ఆర్: అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్! | actioncutok.com