సల్మాన్‌ను పడేస్తున్న కొరియన్ సినిమాలు!


సల్మాన్‌ను పడేస్తున్న కొరియన్ సినిమాలు!
Salman Khan

సల్మాన్‌ను పడేస్తున్న కొరియన్ సినిమాలు!

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు కొరియన్ సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. ఇప్పటికే 2014లో వచ్చిన కొరియన్ ఫిల్మ్ ‘ఓడ్ టు మై ఫాదర్’ సినిమాను అధికారికంగా ‘భారత్’ పేరుతో రీమేక్ చేస్తున్న సల్మాన్ తాజాగా ఇంకో కొరియన్ సినిమా రీమేక్‌కు పచ్చ జెండా ఊపేశాడు. ఆ సినిమా పేరు ‘వెటరన్’.

ఆ సినిమా హిందీ రీమేక్ హక్కుల్ని సల్మాన్ బావ, దర్శకుడు అతుల్ అగ్నిహోత్రి సొంతం చేసుకున్నాడు. ‘భారత్’ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘ఇన్షల్లా’ సినిమాని సల్మాన్ చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత ‘వెటరన్’ రీమేక్‌లో నటిస్తానని సల్మాన్ తెలిపాడు.

“నేను ‘వెటరన్’ చేస్తున్నా. దాని హక్కుల్ని అతుల్ తీసుకున్నాడు. అది చక్కని సినిమా. సంజయ్‌లీలా భన్సాలీ సినిమా తర్వాత ఆ సినిమా చేస్తాం” అని చెప్పాడు సల్మాన్. ఒక క్రైం సిండికేట్‌ను నడిపే యువకుడిని వెంటాడే డిటెక్టివ్ కథ ఈ సినిమా. డిటెక్టివ్‌గా సల్మాన్ నటించనున్నాడు.

సల్మాన్‌ను పడేస్తున్న కొరియన్ సినిమాలు! | actioncutok.com

You may also like: