సమంత షాక్‌కు గురిచేస్తుంది


సమంత షాక్‌కు గురిచేస్తుంది
‘మజిలీ’ సెట్స్‌పై శివ నిర్వాణ, సమంత

సమంత అభిమానుల్లో ‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణ కూడా చేరిపోయాడు. ఆ చిత్రంలో ఆమెను డైరెక్ట్ చేసే అవకాశం పొందిన అతడు ఆమె నటనకు ఫిదా అయిపోయాడు.

“సమంత అలియాస్ శ్రావణి అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. ఆమె మిమ్మల్ని నవ్విస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఏప్రిల్ 5న విడుదలవుతున్న ‘మజిలీ’లో తన అసమాన అభినయంతో మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది” అని ట్విట్టర్ వేదికగా సమంతపై ప్రశంసల జల్లు కురిపించాడు.

శివ చూపించిన అభిమానానికి సమంత కదిలిపోయింది. “ఆనందబాష్పాలు. కృతజ్ఞతలు శివ గారూ.. ఇది నాకు ఆహ్లాదకరమైన సర్‌ప్రైజ్. సో మచ్ లవ్. ఏప్రిల్ 5 కోసం ఎదురుచూస్తున్నా. చాలా చెప్పాలని ఉంది. కానీ వేచి చూస్తాను” అని బదులిచ్చింది.


సమంతను శివ పొగిడిన తీరు చూసిన నాగచైతన్య “అది నిజం శివా” అని ట్వీట్ చేస్తే, “థాంక్యూ హజ్బెండ్” అని చైతూకు బదులిచ్చింది సమంత.

కాగా ‘మజిలీ’లో సమంత పాత్ర పేరు ‘శ్రావణి’ అని శనివారం వెల్లడించిన దర్శకుడు శివ ఈ రోజు నాగచైతన్య పాత్ర పేరు వెల్లడిస్తానని తెలియజేశాడు.

‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రధారులు. షైన్ స్క్రీన్ బేనర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘మజిలీ’ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Related articles: