తండ్రీకొడుకులుగా రణ్‌బీర్ కపూర్!


తండ్రీకొడుకులుగా రణ్‌బీర్ కపూర్!

తండ్రీకొడుకులుగా రణ్‌బీర్ కపూర్!

కెరీర్‌లో తొలిసారి తండ్రీ కొడుకులుగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు! ఆ సినిమా ‘షంషేరా’. కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యశ్‌రాజ్ ఫిలిమ్స్ బేనర్‌పై ఆదిత చోప్రా నిర్మిస్తున్నాడు. షంషేరా అనే టైటిల్ రోల్‌తో పాటు అతని తండ్రి పాత్రలోనూ రణ్‌బీర్ కనిపించనున్నట్లు సమాచారం.

‘కరం సే డెకాయిట్.. ధరం సే ఆజాద్’ అనే ట్యాగ్‌లైన్ ప్రకారం రణ్‌బీర్ బందిపోటుగా కనిపించనున్నాడు. అయితే దోచిన డబ్బును పేదవాళ్లకు పంచిపెట్టే పాత్ర అది. స్వాతంత్ర్య పూర్వ కాలం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో పేదల హక్కుల కోసంతో పాటు స్వాతంత్ర్యం కోసం పోరాడే యోధుడిగా రణ్‌బీర్ నటిస్తున్నాడు. సంజయ్ దత్, వాణీ కపూర్ కీలక పాత్రధారులు.

తండ్రీకొడుకులుగా రణ్‌బీర్ కపూర్!

బందిపోటుగా నటించడం రణ్‌బీర్‌కు ఇదే తొలిసారి. అలాగే గతంలో చేసిన పాత్రలన్నింటికీ చాలా భిన్నమైన పాత్ర. ఎప్పుడూ ఆధునిక యువకుడిగానే తెరపై కనిపిస్తూ వస్తున్న అతను తొలిసారి ఒక గ్రామీణ నేపథ్య పాత్రను చేస్తున్నాడు. 2020 జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ప్రస్తుతం రణ్‌బీర్ చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల కానున్నది. అలియా భట్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రధారులు. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.

తండ్రీకొడుకులుగా రణ్‌బీర్ కపూర్! | actioncutok.com

You may also like: