ఆ సినిమా కోసం రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా!


ఆ సినిమా కోసం రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా!
Pooja Hegde

ఆ సినిమా కోసం రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా!

భారీ, క్రేజీ సినిమాలో నటిస్తే ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందనే ఉద్దేశంతో వర్థమాన తారలు ఇతర అవకాశాల్ని వదిలేసుకొని మరీ నటిస్తుంటారు. ఒక్కోసారి వాళ్ల కల నిజమవుతుంది, ఒక్కోసారి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది. మరి కొన్ని సందర్భాల్లో ఆ కాలం వృథా అయినట్లవుతుంది. పూజా హెగ్డే విషయంలో ఈ మూడోది జరిగింది.

ఈ విషయం ఆమే స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హిందీ సినిమా ‘మొహంజో దారో’ (2016) కోసం రెండేళ్ల కాలం వృథా చేసుకున్నానని ఆమె బాధపడింది. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలు చేసిన ఆమెకు ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం వాటిని చేసే స్థితిలో లేనని ఆమె వాటిని తిరస్కరించింది.

కారణం.. అప్పటికే బాలీవుడ్‌లో ‘మొహంజో దారో’ సినిమాకు సంతకం చెయ్యడం, ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా ఒప్పుకోకూడని ఆ చిత్ర దర్శకుడు షరతు పెట్టడం.

ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన చెప్పడం వల్ల, ఒక చారిత్రక సినిమా చేస్తున్నానే ఉద్దేశంతోనూ, హృతికి రోషన్ వంటి ఒక అగ్రశ్రేణి నటునితో చేస్తున్నాననే ఆనందంతోనూ ఆమె ఆ షరతులకు అంగీకరించింది.

సుమారు రెండేళ్ల కాలం ఆ సినిమాకు ఆమె వెచ్చించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె పడిన కష్టానికి ఫలితం లేకుండా పోవడమే కాకుండా, ఇతర అవకాశాల్నీ నష్టపోయినట్లయింది.

అందుకే ఇప్పుడు ఆ కాలం వృథా చేసుకున్నానని ఆమె బాధ పడింది. ఒక నటికి రెండేళ్ల కాలం ఎక్కువేననీ, ఆ సమయంలో కనీసం నాలుగైదు సినిమాల్లో నటించేదాన్ననీ ఆమె తెలిపింది. ఆ సినిమా ఇచ్చిన అనుభవంతో కథల ఎంపికలోనూ, కాల్షీట్ల విషయంలోనూ జాగ్రతలు పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది పూజ.

ఆ సినిమా కోసం రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా!
Pooja Hegde and Hrithik Roshan in MOHENJO DARO

ఆ సినిమా కోసం రెండేళ్లు వేస్ట్ చేసుకున్నా! | actioncutok.com

You may also like: