అప్పుడు కొణిదెల రాజారామ్.. ఇప్పుడు రామ్ కొణిదెల!


అప్పుడు కొణిదెల రాజారామ్.. ఇప్పుడు రామ్ కొణిదెల!

అప్పుడు కొణిదెల రాజారామ్.. ఇప్పుడు రామ్ కొణిదెల!

చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’కూ, రాంచరణ్ ‘వినయ విధేయ రామ’కూ పోలికలున్నాయా? ఉన్నాయని నిరూపించారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

చిరంజీవి అన్నయ్య మురళీమోహన్‌ను విలన్లు చంపితే, వారిపై చిరంజీవి ప్రతీకారం తీర్చుకోవడం ‘గ్యాంగ్ లీడర్’లోని ప్రధానాంశం అయితే, తన పెద్దన్నయ్య ప్రశాంత్‌ను చంపిన విలన్లను రాంచరణ్ మట్టుబెట్టడం ‘వినయ విధేయ రామ’లోని ప్రధానాంశమని యూట్యూబ్ చానల్‌లో తాను సమర్పించే ‘లెవెన్త్ అవర్’ ప్రోగ్రాంలో గోపాలకృష్ణ చెప్పారు.

అంతే కాదు, ‘గ్యాంగ్ లీడర్’లో చిరంజీవి పేరు కొణిదెల రాజారాం అయితే, ‘వినయ విధేయ రామ’లో రాంచరణ్ పేరు రాం కోణిదెల అనే విషయాన్నీ ఆయన బయటపెట్టారు.

“సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడవనేది స్క్రీన్‌ప్లే ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. క్లైమాక్స్ ముందు దాకా అన్నయ్య (ప్రశాంత్) చనిపోయాడనే విషయం కుటుంబంలో ఎవరికీ తెలీదు. నవ్వించడం తేలిక. ఏడ్పించడం కష్టం. ‘గ్యాంగ్ లీడర్’లో మురళీమోహన్ చనిపోవడాన్ని స్పష్టంగా చూపిస్తాం” అని గోపాలకృష్ణ చెప్పారు.

తామైతే వదినకు తప్ప కుటుంబంలోని మిగతావాళ్లందరికీ అన్నయ్య చనిపోయిన విషయం తెలిసి, వదినకు తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆమెకు తెలపకుండా ఉంటారని సూచించేవాళ్లమన్నారు. అప్పుడు వదినకు ఎప్పుడు తెలుస్తుందనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురు చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కథను ఇలా కూడా రాసుకోవచ్చని మాత్రమే తాను చెప్తున్నాననీ, ఇలా చేస్తే తప్పకుండా ఆడుతుందని తాను చెప్పడం లేదనీ ఆయన తెలిపారు.

కథను మొదలుపెట్టిన ముఖేష్ రిషి బృందం ఏమయ్యారో చూపించలేదనీ, ఇది ఒక లోపమనీ ఆయన తెలిపారు. అలాగే కొన్ని సన్నివేశాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయనే విషయం అర్థం కాలేదనీ, బిహార్ ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి తన సెక్యూరిటీతో వస్తే, ఆ సెక్యూరిటీవాళ్లు రాంపై గన్స్ ఎక్కుపెట్టడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

చిరంజీవి హీరోగా విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ (1991) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రచించారు.

అప్పుడు కొణిదెల రాజారామ్.. ఇప్పుడు రామ్ కొణిదెల!

అప్పుడు కొణిదెల రాజారామ్.. ఇప్పుడు రామ్ కొణిదెల! | actioncutok.com

You may also like: