‘ఆర్ ఆర్ ఆర్’కు సుద్దాల అశోక్‌తేజ పాటలు


'ఆర్ ఆర్ ఆర్'కు సుద్దాల అశోక్‌తేజ పాటలు

‘ఆర్ ఆర్ ఆర్’కు సుద్దాల అశోక్‌తేజ పాటలు

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకొని, త్వరలో కోల్‌కతా షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల గురించి గురువారం జరిపే మీడియా ఇంటరాక్షన్‌లో రాజమౌళి క్లారిటీ ఇవ్వనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మార్చి 8 నుంచి హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తెలిపారు. తాజాగా ఆయనే మరో అప్‌డేట్ ఇచ్చారు. జాతీయ అవార్డు గ్రహీత  సుద్ధాల అశోక్‌తేజ ఈ సినిమా కోసం పాటలు రాస్తున్నట్లు ట్వీట్ చేశారు.

అయితే ఆయన ఎన్ని పాటలు రాస్తున్నారనే విషయం తెలుపలేదు. సుద్దాల చాలా వేగంగా, అదే సమయంలో అద్భుతంగా రాస్తున్నారని కీరవాణి కితాబిచ్చారు. కీరవాణి కట్టిన ట్యూన్లకు అనుగుణంగా సుద్దాల లిరిక్స్ రాస్తున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’కు సుద్దాల అశోక్‌తేజ పాటలు | actioncutok.com

You may also like: