సూర్యతో విజయ్ దేవరకొండ ఢీ!


సూర్యతో విజయ్ దేవరకొండ ఢీ!

సూర్యతో విజయ్ దేవరకొండ ఢీ!

తెలుగు సినిమా సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, తమిళ టాప్ హీరోల్లో ఒకరైన సూర్యతో ఢీకొనబోతున్నాడు. అవును. విజయ్ సినిమా ‘డియర్ కామ్రేడ్’, సూర్య సినిమా ‘ఎన్‌జీకే’.. రెండూ మే 31న విడుదవుతున్నాయి.

‘డియర్ కామ్రేడ్’ను తెలుగుతో బాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో మే 31న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. రష్మికా మండన్న నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు.

మరోవైపు సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఎన్‌జీకే’ని మే 31న విడుదల చేయనున్నట్లు ఇటీవలే దాని నిర్మాతలు ప్రకటించారు. సహజంగానే తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా వస్తోంది. ఇందులో సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ నాయికలుగా నటిస్తున్నారు. వీళ్లందరూ తెలుగు ప్రేక్షకులకూ బాగా పరిచయస్తులు.

ఈ నేపథ్యంలో ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో బాక్సాఫీస్ వద్ద ‘డియర్ కామ్రేడ్’, ‘ఎన్‌జీకే’ ఫైట్ అనివార్యమవుతోంది. చూద్దాం.. ఏ జరుగుతుందో!

సూర్యతో విజయ్ దేవరకొండ ఢీ!

సూర్యతో విజయ్ దేవరకొండ ఢీ! | actioncutok.com

You may also like: