వాళ్ల లవ్ స్టోరీ పబ్లిసిటీ స్టంటా?


వాళ్ల లవ్ స్టోరీ పబ్లిసిటీ స్టంటా?
Sara Ali Khan and Kartik Aaryan

వాళ్ల లవ్ స్టోరీ పబ్లిసిటీ స్టంటా?

మనం అనుకున్న దానికంటే సారా అలీఖాన్ చాలా తెలివైన అమ్మాయిగా కనిపిస్తోంది. కార్తీక్ ఆర్యన్‌తో సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం వెనుక ఏదో ఉందనే అభిప్రాయం కలిగేలా ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంను ఆమె ఉపయోగించుకున్న తీరు దీనికి నిదర్శనం.

కార్తీక్‌తో డేటింగ్‌కు వెళ్లడానికి తనకు ఆసక్తిగా ఉన్నదంటూ ఆమె ఇచ్చిన హావభావాలు కరణ్ జోహార్ సహా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దాంతో కార్తీక్‌పై ఆమెకు నిజంగా ఆసక్తి ఉన్నదనీ, అతడ్ని బాయ్‌ఫ్రెండ్‌గా కోరుకుంటున్నదనీ చాలామంది భావించారు.

తమ తొలి సినిమా షూటింగ్‌లో ఆ ఇద్దరూ పాల్గొంటూ ఉంటే, మీడియాలో ఆ ఇద్దరి అనుబంధం గురించి కథలు అల్లడం మొదలైంది. ఆ సినిమాకి సంబంధించిన లీక్ అయిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఆ ఫొటో చూస్తుంటే అది ఆ ఇద్దరి అనుబంధానికి అద్దం పడుతున్నదంటూ రాసేస్తున్నారు. కానీ అది ఇంకా టైటిల్ పెట్టని వాళ్ల సినిమాకు సంబంధించిన ఫొటో అనేది స్పష్టమైంది.

రోజులు గడిచే కొద్దీ, కేవలం తమ జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడం కోసమే సారా అలా ప్రవర్తించిందనే విషయం మనకు అర్థమవుతూ వచ్చింది.

అలాగే కొత్తగా బయటకొచ్చిన ఒక వీడియోలో ఆ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో తెలుస్తోంది. కార్తీక్ పేరును తను పదే పదే ఉచ్ఛరించడంతో కార్తీక్ స్పందించిన తీరుకు సారా పగలబడి నవ్వింది. దాంతో కాస్త ఇబ్బందిపడ్డ కార్తీక్ ఆమె నోటిని మూయడానికి ప్రయత్నించాడు.

ఆ ఇద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేననీ, ప్రేమికులు కారనీ వాళ్ల సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.

View this post on Instagram

#saraalikhan and #kartikaaryan are adorable together as they shoot in the capital for #imtiazali movie #instadaily #instagood #manavmanglani #Bollywood @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

వాళ్ల లవ్ స్టోరీ పబ్లిసిటీ స్టంటా? | actioncutok.com

You may also like: