శ్రీదేవి పాత్ర చెయ్యాలంటే గట్స్ కావాలి!


శ్రీదేవి పాత్ర చెయ్యాలంటే గట్స్ కావాలి!

శ్రీదేవి పాత్ర చెయ్యాలంటే గట్స్ కావాలి!

మంచి నటి కానీ నటుడు కానీ తనను సవాలు విసిరే పాత్ర కోసం ఆకలిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి తారల్లో విద్యా బాలన్ ఒకరు. విలక్షణ పాత్రలతో సినీ ప్రియుల్ని ఆమె తరచూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటున్నారు. తనకు అవకాశం లభిస్తే తప్పకుండా శ్రీదేవి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమని ఇటీవల ఆమె తెలిపారు.

శ్రీదేవిగా నటించే అవకాశం వస్తే అది ఆమెకు తాను సమర్పించే నీరాజనమవుతుందని ఆమె అన్నారు. “ఆమె పాత్ర చెయ్యడానికి చాలా గట్స్ కావాలి. కానీ ఆమెకు నీరాజనం సమర్పించడానికి ఆ పాత్రను చేస్తాను” అన్నారు విద్య.

ఆసక్తికరమైన విషయమేమంటే, ‘మిస్టర్ ఇండియా’ సినిమాలో శ్రీదేవి నర్తించిన ఐకనిక్ సాంగ్ ‘హవా హవాయీ’ రీమిక్స్ వెర్షన్‌ను ‘తుమ్హారీ సుళు’ సినిమా కోసం విద్య చేశారు. మరోవైపు శ్రీదేవిపై బయోపిక్ రూపొందించాలని డైరెక్టర్ హన్సల్ మెహతా తహతహ లాడుతున్నారు.

“ఆ సినిమా రూపొందుతుంది. అది చెయ్యడానికి యాక్టర్లున్నారు. నేను విద్యా బాలన్‌ను సంప్రదిద్దామనుకుంటున్నా. నేనా సినిమా తీస్తాను” అని ఇదివరలోనే ఆయన చెప్పాడు. కాబట్టి, సమీప భవిష్యత్తులోనే శ్రీదేవి కథ వెండితెరకు ఎక్కే అవకాశాలున్నాయి.

శ్రీదేవి పాత్ర చెయ్యాలంటే గట్స్ కావాలి! | actioncutok.com

You may also like: