రష్మికతో కార్తీ 19!


రష్మికతో కార్తీ 19!

రష్మికతో కార్తీ 19!

తెలుగు, కన్నడ ప్రేక్షకుల్ని తన అందచందాలు, అభినయ సామర్థ్యంతో అలరిస్తోన్న రష్మికా మండన్న ఇప్పుడు తమిళ ప్రేక్షకుల్నీ అలరించేందుకు సై అంటోంది. కార్తీ కథానాయకుడిగా నటిస్తోన్న 19వ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి ఆమె పరిచయమవుతోంది.

‘రేమో’ ఫేం భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణ పనులు బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలయ్యాయి. హీరో హీరోయిన్లు కార్తీ, రష్మిక ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాతో తమిళానికి పరిచయమవుతున్నందుకు సతోషాన్ని వ్యక్తం చేసిన రష్మిక ట్విట్టర్ వేదికగా స్పందించింది.

“కన్నడ, తెలుగు ప్రజలు నాకు గొప్పగా సపోర్ట్ చేస్తున్నారు. తమిళానికి ఎప్పుడు వస్తున్నారని మీరంతా అడుగుతున్నారు. ఎట్టకేలకు 2019లో ఈ సినిమాతో వస్తున్నాను. ఈ టీంతో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పోస్ట్ చేసింది రష్మిక.

ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీత దర్శకుడిగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

రష్మికతో కార్తీ 19! | actioncutok.com

You may also like: