సింహం సింగిల్‌గానే వస్తుంది: షర్మిళ


సింహం సింగిల్‌గానే వస్తుంది: షర్మిళ

సింహం సింగిల్‌గానే వస్తుంది: షర్మిళ

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎవరితోనూ పెట్టుకోలేదని వైఎస్ జగన్ సోదరి షర్మిళ స్పష్టం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని తన అన్నను ఉద్దేశించి అన్నారు. శనివారం గుంటూరు నగరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.

గత మూడు నెల్ల వరకూ కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారనీ. ఆఖరికి హరికృష్ణ గారు చనిపోతే ఆయన మృతదేహం పక్కన ఉందన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు మాట్లాడారనీ ఆమె విమర్శించారు.

పొత్తు పెట్టుకోవాలని చూసింది ఆయనైతే, ఇప్పుడు కేసీఆర్‌తో తమకు పొత్తుందని ఆయన ఆరోపిస్తున్నారనీ అన్నారు. ఇదివరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారనీ, హ్యాపీగా నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశాడనీ షర్మిళ ఎద్దేవా చేశారు.

“ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నా, మాకు కేసీఆర్ గారితో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్‌తో పొత్తు లేదు. మాకు పొత్తు అవసరం లేదు. ఎందుకు? సింహం సింగిల్‌గానే వస్తుంది” అని ఆమె అన్నారు.

కాగా షర్మిళ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నది గమనార్హం. ఆమె ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.

సింహం సింగిల్‌గానే వస్తుంది: షర్మిళ | actioncutok.com

You may also like: