50 సంవత్సరాల ‘అర్ధరాత్రి’


50 సంవత్సరాల 'అర్ధరాత్రి'

50 సంవత్సరాల ‘అర్ధరాత్రి’

జగ్గయ్య, భారతి జంటగా హైదరాబాద్ మూవీస్ నిర్మించిన ‘అర్ధరాత్రి’ సినిమా విడుదలై నేటికి యాభై ఏళ్లు. పి. సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1969 ఏప్రిల్ 12న విడుదలైంది. ఆ రోజులతో పోలిస్తే ఈ సినిమా కథా కథనాల్లో కొత్తదనాన్ని ప్రదర్శించింది.

‘అర్ధరాత్రి’ 15 రీళ్ల సినిమా. ఇందులో 13 రీళ్ల వరకు హీరో హీరోయిన్లు మాట్లాడుకోకపోవడం ఒక విశేషం. అయినా వాళ్లు కళ్లతో, చేష్టలతో చూపే హావభావాలు, ప్రేమావేశాలు అలరిస్తాయి. సాంబశివరావుకు దర్శకుడిగా ఇది తొలి సినిమా. ఆయన కల్పించిన సన్నివేశాలు ఆయన ప్రతిభకు, ఆశయాలకు అద్దం పడతాయి.

ఆరుద్ర రచన చిత్రానికి నిండుదనం ఇచ్చింది. మాస్టర్ వేణు సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం చిత్రానికి ఒక ఉదాత్త స్థాయిని సమకూర్చింది.

చిత్రంలో సరళగా భారతి నటన, కళ్లతో, చేష్టలతో అందించిన్ హావభావాలు ప్రతి ఒక్కరినీ పులకింప జేసేంతటి చక్కగా ఉంటాయి. హీరోగా జగ్గయ్య నటన అందర్నీ అలరింపజేస్తుంది. నటనలో ఆయన చూపిన నిగ్రహం, పరిణతి పాత్రకు న్యాయం చేకూర్చింది.

తారాగణం: జగ్గయ్య, భారతి, రావి కొండలరావు, నాగయ్య, రాధిక, రమణారెడ్డి, చదలవాడ కుటుంబరావు, మోదుకూరి సత్యం, ప్రసాద్, సీతారాం, అప్పారావు, ఉషాకుమారి

సంభాషణలు: ఆరుద్ర

సంగీతం: మాస్టర్ వేణు

సినిమాటోగ్రఫీ: సత్యనారాయణ

ఎడిటింగ్: వీరప్ప

ఆర్ట్: రాజేంద్రకుమార్

మేకప్: పోతరాజు

నిర్మాత: పి. గంగాధరరావు

దర్శకత్వం: పి. సాంబశివరావు

బేనర్: హైదరాబాద్ మూవీస్

విడుదల తేది: 1969 ఏప్రిల్ 12

50 సంవత్సరాల 'అర్ధరాత్రి'

50 సంవత్సరాల ‘అర్ధరాత్రి’ | actioncutok.com

You may also like: