చిరంజీవి ‘సైరా’ చెయ్యడానికి వెనకున్న కథ!


చిరంజీవి 'సైరా' చెయ్యడానికి వెనకున్న కథ!

చిరంజీవి ‘సైరా’ చెయ్యడానికి వెనకున్న కథ!

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి చేస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి తొమ్మిదేళ్ల పాటు నటనకు దూరమయ్యారు (మధ్యలో ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ సినిమాల్లో చేసిన అతిథి పాత్రల్ని పరిగణలోకి తీసుకోలేదు).

చేస్తోన్న ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి తొమ్మిదేళ్ల పాటు నటనకు దూరమయ్యారు (మధ్యలో ‘మగధీర’, ‘బ్రూస్‌లీ’ సినిమాల్లో చేసిన అతిథి పాత్రల్ని పరిగణలోకి తీసుకోలేదు).

రాజకీయాలు తన ఒంటికి సరిపడవని అర్థం చేసుకున్న ఆయన తిరిగి ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు రావాలని అనుకున్నప్పుడు ఒక వీరోచిత పాత్రతో వస్తే బాగుంటుందని సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ సూచించారు. చిరంజీవి సైతం అలాగే చేద్దామనుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అప్పుడే చెప్పారు.

అయితే అంత శక్తిమంతమైన పాత్రను కంబ్యాక్ ఫిలింలో చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చిరంజీవి సందేహించారు. మొదట ఒక కమర్షియల్ సినిమా చేసి, ప్రేక్షకుల ఆదరణను బట్టి ముందుకెళ్లాలని చిరంజీవి భావించారు. అప్పుడు ఇటు కమర్షియల్ విలువలతో పాటు రైతు నాయకుడి పాత్ర ఉన్న తమిళ చిత్రం ‘కత్తి’ని ఆయన దృష్టికి తెచ్చారు నిర్మాత అల్లు అరవింద్.

చూసిన వెంటనే ‘కత్తి’ నచ్చి, ‘ఖైదీ నంబర్ 150’గా ఆ సినిమా చేసి విజయం సాధించారు చిరంజీవి. ఆ సినిమా ఇచ్చిన ఉత్తేజంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చెయ్యడానికి ఇదే తగిన సమయమని ఆయన నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ విషయంలోనే ఆయన మల్లగుల్లాలు పడ్డారు.

ఆ కథను ఎవరు హ్యాండిల్ చెయ్యగలరని అనుకున్నప్పుడు అప్పుడే ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తీసిన గుణశేఖర్ పేరు పరిగణనలోకి వచ్చినా, రాంచరణ్‌తో ‘ధృవ’ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి తీసిన విధానం చూసి, అతనికే అవకాశం ఇచ్చారు చిరంజీవి. అలా ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా సెట్స్‌పైకి వచ్చింది.

చిరంజీవి ‘సైరా’ చెయ్యడానికి వెనకున్న కథ! | actioncutok.com

You may also like: