రెండేళ్ల తర్వాత కెమెరా ముందుకు క్రేజీ హీరోయిన్!


రెండేళ్ల తర్వాత కెమెరా ముందుకు క్రేజీ హీరోయిన్!
Vijaya Sethupathi and Shruti Haasan

రెండేళ్ల తర్వాత కెమెరా ముందుకు క్రేజీ హీరోయిన్!

శ్రుతి హాసన్ సినిమా చేసి రెండేళ్ల‌వుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో న‌టించిన ‘కాట‌మ‌రాయుడు’ 2017 మార్చి 24న విడుద‌లైంది. అంత‌కు ముందు నుంచే తెలుగులో శ్రుతి ఏ చిత్రాన్నీ అంగీక‌రించ‌లేదు. సినిమాల‌కు కొంత విరామం ప్ర‌క‌టించిన ఆమె స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌మిళ చిత్రాల్లో పాట‌లు పాడుతూ, త‌న బాయ్‌ఫ్రెండ్‌తో చ‌క్క‌ర్లు కొడుతూ కాల‌క్షేపం చేసింది.

తి హాసన్ సినిమా చేసి రెండేళ్ల‌వుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో న‌టించిన ‘కాట‌మ‌రాయుడు’ 2017 మార్చి 24న విడుద‌లైంది. అంత‌కు ముందు నుంచే తెలుగులో శ్రుతి ఏ చిత్రాన్నీ అంగీక‌రించ‌లేదు. సినిమాల‌కు కొంత విరామం ప్ర‌క‌టించిన ఆమె స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌మిళ చిత్రాల్లో పాట‌లు పాడుతూ, త‌న బాయ్‌ఫ్రెండ్‌తో చ‌క్క‌ర్లు కొడుతూ కాల‌క్షేపం చేసింది.

అలాగే లండ‌న్‌లో సొంత బ్యాండ్ ట్రూప్‌తో మ్యూజిక్ షోలు చేసింది. దీంతో ఇక శ్రుతి సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసిన‌ట్టేనా అంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. ఆ ఊహాగానాలను బ్రేక్ చేస్తూ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది శ్రుతి. త‌మిళ చిత్ర సీమ‌లో విల‌క్ష‌ణ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న న‌టుడు విజ‌య్ సేతుప‌తి.

త‌ను నిర్మాత‌గా మారి అరుముగ‌న్ కుమార్‌తో క‌లిసి విజ‌య్ సేతుప‌తి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని న‌టిస్తూ నిర్మిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా శ్రుతి న‌టిస్తోంది. ఎస్‌.పి. జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సోమ‌వారం చెన్నైలో నిరాడంబ‌రంగా ప్రారంభ‌మైంది.

కాగా ‘లాభమ్‌’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఖ‌రారు చేశారు. రెండేళ్ల విరామం త‌రువాత శ్రుతి న‌టిస్తున్న సినిమా కావ‌డం, పైగా విజ‌య్‌ సేతుప‌తి న‌టిస్తూ నిర్మిస్తుండ‌టంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

రెండేళ్ల తర్వాత కెమెరా ముందుకు క్రేజీ హీరోయిన్! | actioncutok.com

You may also like: