‘చిత్రలహరి’ ఆ సినిమాలా హిట్టయ్యేనా?


'చిత్రలహరి' ఆ సినిమాలా హిట్టయ్యేనా?

‘చిత్రలహరి’ ఆ సినిమాలా హిట్టయ్యేనా?

కిశోర్ తిరుమల మరి కొద్ది రోజుల్లో మన ముందుకు ‘చిత్రలహరి’ సినిమాని తీసుకొస్తున్నాడు. సాయి ధరంతేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కాంబినేషన్‌తో ఆయన తీసిన సినిమా ఇప్పటికే సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్ చాలా పాత తరహాలో చాలా సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ పాటలు బాగా ఆదరణ పొందాయి. టీజర్ కూడా ఆసక్తిని పెంచింది.

ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం కిశోర్ రూపొందించిన ‘నేను.. శైలజ’ సినిమాను రూపొందించిన వైనం గుర్తుకొస్తోంది. హీరోయిన్‌కు సంబంధించిన రెండు సమాంతర కథల్ని కిశోర్ చాలా బాగా ఆ సినిమాలో హ్యాండిల్ చేశాడు. ఒకటి హరి (రాం)తో శైలజ ప్రేమకథ, ఇంకోటి తండ్రితో శైలజ ఘర్షణ కథ.

హరితో శైలజ “నేను నిన్ను ప్రేమిస్తున్నా. కానీ నేను నీతో ప్రేమలో లేను” అని చెప్పిన డైలాగ్ చాలా ఆశ్చర్యపరుస్తుంది, హరికి మాదిరిగానే. శైలజ పాత్రను అతను మలిచిన తీరు, తండ్రిని ఆమె తప్పుగా అర్థం చేసుకొని ద్వేషించిన వైనం కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి.

కుటుంబ బంధాల్ని కిశోర్ చూపించిన తీరు ముచ్చటేస్తుంది. శైలజ కుటుంబంలోని సమస్యల్ని హరి పరిష్కరించే తీరు, ఆ కుటుంబ సభ్యుల మనసుల్ని అతను గెలిచే తీరు నమ్మాలనిపించేట్లే ఉంటుంది. అదే సమయంలో పలు సన్నివేశాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అవెక్కడా బలవంతంగా చొప్పించినట్లు ఉండవు.

ఇప్పుడు ‘చిత్రలహరి’ టీజర్ చూస్తే అలాంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలకు కొందవ ఉండదనిపిస్తోంది. ఒకవైపు స్వయంగా హీరో సాయిధరం, ఇంకోవైపు కమెడియన్ సునీల్ మనకి కావాల్సినంత వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ కేరెక్టర్లు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. నివేదా పాత్ర స్మార్ట్‌గా తోస్తుంటే, కల్యాణి పాత్ర స్వచ్ఛంగా కనిపిస్తోంది. మొత్తానికి ‘చిత్రలహరి’తో కిశోర్ మనల్ని అలరించేట్లే ఉన్నాడు.

'చిత్రలహరి' ఆ సినిమాలా హిట్టయ్యేనా?

‘చిత్రలహరి’ ఆ సినిమాలా హిట్టయ్యేనా? | actioncutok.com

You may also like: