దేవి శ్రీప్రసాద్ కంటే గోపి సుందర్ బెటర్!


దేవి శ్రీప్రసాద్ కంటే గోపి సుందర్ బెటర్!
Akhil

దేవి శ్రీప్రసాద్ కంటే గోపి సుందర్ బెటర్!

అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో ఒక సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనున్నది. కాగా ఈ సినిమాకి మొదట సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్‌ను సంప్రదించారు. అతను ఓకే కూడా చెప్పాడు.

కానీ ఇప్పుడు హీరో, దర్శకుడు మనసులు మార్చుకున్నారు. దేవి స్థానంలో మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్‌ను తీసుకున్నారు. నిర్మాతలు కూడా ఓకే అనేశారు. గోపి సుందర్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘గీత గోవిందం’కు సూపర్ హిట్ మ్యూజిక్‌ను అందించాడు.

కాగా ఈ మార్పుకు ప్రధాన కారణం అఖిలేనని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన నాగచైతన్య సినిమా ‘మజిలీ’ పాటలు గోపి సుందర్ సంగీత స్వరాలతో సంగీత ప్రియుల్ని అమితంగా అలరించాయి. అందుకే అతడితోనే తన సినిమాకు మ్యూజిక్ ఇప్పించాలని అఖిల్ కోరుకోవడంతో దర్శక నిర్మాతలు సరేనన్నారు.

అఖిల్ జోడీగా రష్మికా మండన్న నటించే ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్తోంది.

దేవి శ్రీప్రసాద్ కంటే గోపి సుందర్ బెటర్! \ actioncutok.com

You may also like: