‘లక్ష్మి’ కాదు.. ‘లాక్ష్మిబాంబ్’!


'లక్ష్మి' కాదు.. 'లాక్ష్మిబాంబ్'!

‘లక్ష్మి’ కాదు.. ‘లాక్ష్మిబాంబ్’!

రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తోన్న ‘కాంచన’ హిందీ రీమేక్ ఆదివారం (ఏప్రిల్ 28) సెట్స్‌పైకి వెళ్లింది. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ హిజ్రాగా కనిపించనున్నారు. కాగా ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ ‘లక్ష్మి’ అని వినిపించగా, తాజాగా ‘లాక్ష్మిబాంబ్’ అని ఖరారు చేశారు. ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో ‘లక్ష్మి’ (Lakshmi) అని కాకుండా ‘లాక్ష్మి’ (Laaxmi) అని రాయడం గమనార్హం.

‘లాక్ష్మి’ కేరెక్టర్‌ను అమితాబ్ చేస్తున్నారు. ‘సీన్ నం.5’, ‘షాట్ నం. 22’, ‘టేక్ నం. 2’ అని రాసున్న క్లాప్ బోర్డును కియారా పట్టుకొని ఉన్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు. వెట్రి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాని కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

లారెన్స్‌కు డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా. తొలి సినిమాలోనే అక్షయ్ కుమార్ వంటి టాప్ స్టార్‌ని డైరెక్ట్ చేసే అవకాశం అతనికి లభించింది. ఒరిజినల్ ‘కాంచన’లోని హీరొ హీరోయిన్ల కేరెక్టర్లలో మార్పులు చేసి ఈ సినిమాని రూపొందిస్తున్నాడు లారెన్స్.

'లక్ష్మి' కాదు.. 'లాక్ష్మిబాంబ్'!

‘లక్ష్మి’ కాదు.. ‘లాక్ష్మిబాంబ్’! | actioncutok.com

Trending now: