అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలైంది


అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మొదలైంది

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ శనివారం ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, త్రివిక్రంతో మూడో చిత్రం. ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు వచ్చాయి. కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో  ఉన్నాయి. 

ఈ నెల 24  నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు.

టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేశ్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్ ఎస్., ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మొదలైంది
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మొదలైంది

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలైంది | actioncutok.com

You may also like: