అల్లు అర్జున్ ఒక ‘ఐకాన్’!


అల్లు అర్జున్ ఒక 'ఐకాన్'!
Allu Arjun

దిల్ రాజుసినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అతనికి శుభా కాంక్షలు తెలుపుతూ దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ఈ విషయం తెలియజేసింది.

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాని తర్వాత తన 20వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్‌లో చెయ్యాలని అతని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ‘ఐకాన్’ సినిమా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘కనబడుట లేదు’ అనేది ఉప శీర్షిక.

తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ ఫ్లాపైనా, రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’తో విజ యాన్ని అందుకున్నాడు వేణు శ్రీరామ్. ఆ రెండు సినిమాల్ని నిర్మించిన దిల్ రాజు ఇప్పుడతనికి మూడో అవకాశాన్నీ తనే ఇస్తుండటం గమనార్హం. మరో వైపు అల్లు అర్జున్‌తో దిల్ రాజుకు ఇది ఐదో చిత్రం కానున్నది.

ఇదివరకు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘పరుగు’, ‘ఎవడు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలు వచ్చాయి.

అల్లు అర్జున్ ఒక ‘ఐకాన్’! | actioncutok.com

You may also like: