ఈ అల్లు వారబ్బాయి ‘క్రాసోవర్ స్టార్’!


ఈ అల్లు వారబ్బాయి 'క్రాసోవర్ స్టార్'!

ఈ అల్లు వారబ్బాయి ‘క్రాసోవర్ స్టార్’!

తెలుగులో హీరోగా నిలదొక్కుకోడానికి తీవ్రంగా శ్రమిస్తోన్న అల్లు శిరీష్ రాష్ట్రం బయట ఒక అవార్డ్ కొట్టేశాడు. అది కూడా ‘క్రాసోవర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’గా. కొచ్చిలో జరిగిన లులు ఫ్యాషన్ వీక్ 2019 వేడుకలో శిరీష్ ఈ అవార్డును అందుకున్నాడు.

మలయాళం మూవీ ‘1971’లో సూపర్‌స్టార్ మోహన్‌లల్‌తో కల్సిన నటించాడు శిరీష్. అందులో అతడు ప్రదర్శించిన నటనకు గాను ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో నటి మమతా మోహన్‌దాస్ పాల్గొన్నారు. ఒక తెలుగు నటుడు ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి అని శిరీష్ పీఆర్వోలు తెలిపారు.

కాగా శిరీష్ తాజా చిత్రం ‘ఏబీసీడీ’ మే 17న విడుదలకు సిద్ధమవుతోంది. రుక్షార్ థిల్లాన్ నాయికగా నటించిన సంజీవ్‌రెడ్డి దర్శకుడు.

ఈ అల్లు వారబ్బాయి 'క్రాసోవర్ స్టార్'!

ఈ అల్లు వారబ్బాయి ‘క్రాసోవర్ స్టార్’!| actioncutok.com

Trending now: