అమితాబ్ వేషం: తెల్ల చొక్కా.. ధోతి.. ఎర్ర కండువా!


అమితాబ్ వేషం: తెల్ల చొక్కా.. ధోతి.. ఎర్ర కండువా!

అమితాబ్ వేషం: తెల్ల చొక్కా.. ధోతి.. ఎర్ర కండువా!

తెలుగులో తొలి సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా చేస్తోన్న అమితాబ్ బచ్చన్, ఇప్పుడు తన తొలి తమిళ సినిమా చేస్తున్నారు. తమిళ్‌వాణన్ (‘మచ్చకారన్’ ఫేం) డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమా పేరు ‘ఉయర్నద మణిదాన్’. ఇందులో అమితాబ్, రమ్యకృష్ణ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రధారి.

గత ఏడాది ఆగస్టులోనే ఈ సినిమా కోసం అమితాబ్ సంతకం చేశారు. అయితే షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాలో అమితాబ్ లుక్ ఎలా ఉంటుందో చెప్పే స్టిల్స్ బయటకు వచ్చాయి. ఎస్.జె. సూర్య స్వయంగా అమితాబ్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇందులో అమితాబ్ తమిళ సంప్రదాయం ఉట్టిపడే తెల్లటి చొక్కా, ధోతీ, మెడలో ఎర్రటి కండువా, నుదుటున శివభక్తుడిని సూచించే నామాలు, కుంకుమ బొట్టుతో విలక్షణంగా కనిపిస్తున్నారు.

తిరుచందూరు మురుగన్ ప్రొడక్షన్స్, ఫైవ్ ఎలిమెంట్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌందర రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తమిళ్‌వాణన్ వినిపించిన స్క్రిప్టుకు ఇంప్రెస్ అయిన బిగ్ బి ఈ సినిమా కోసం 40 రోజులు కాల్షీట్లు కేటాయించారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

“నా జీవితంలోనే ఇవి అత్యంత ఆనందకర క్షణాలు. కనీసం కలలోనూ ఊహించని విధంగా ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ అమితాబ్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చి నా కల నెరవేర్చినందుకు ఆ దేవుడికి, అమ్మానాన్నలకు కృతజ్ఞతలు” అని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు సూర్య.

అమితాబ్ వేషం: తెల్ల చొక్కా.. ధోతి.. ఎర్ర కండువా! | actioncutok.com

You may also like: