‘అంగ్రేజీ మీడియం’ షురూ!


'అంగ్రేజీ మీడియం' షురూ!

‘అంగ్రేజీ మీడియం’ షురూ!

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలం తర్వాత తిరిగి తన పనిలో అడుగుపెట్టాడు. అరుదైన న్యూరోయెండోక్రైన్ ట్యూమర్ వాధికి గురైన ఆయన లండన్‌లో చికిత్సానంతరం రెండు రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చాడు. రావడం ఆలస్యం, శుక్రవారం కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.

హిట్ సినిమా ‘హిందీ మీడియం’కు సీక్వెల్ అయిన ‘అంగ్రేజీ మీడియం’లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హోమీ అదజానియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షూటింగ్ మొదలైంది. ఉదయ్‌పూర్‌తో పాటు లండన్‌లో చిత్రీకరణ జరగనున్నట్లు నిర్మాత దినేష్ తెలిపారు.

పేరుకు ‘హిందీ మీడియం’కు సీక్వెల్ అయినప్పటికీ ఒక కొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ హోమీ చెప్పారు.

'అంగ్రేజీ మీడియం' షురూ!

‘అంగ్రేజీ మీడియం’ షురూ! | actioncutok.com

You may also like: