‘అర్జున్ సురవరం’ను ఎదుర్కోవడానికి సిద్ధమేనా?


'అర్జున్ సురవరం'ను ఎదుర్కోవడానికి సిద్ధమేనా?

‘అర్జున్ సురవరం’ను ఎదుర్కోవడానికి సిద్ధమేనా?

నిఖిల్ టైటిల్ రోల్ చేసిన ‘అర్జున్ సురవరం’ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. టి. సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లావణ్యా త్రిపాఠి నాయిక. కథానుసారం అర్జున్ సురవరం టీవీ 99 రిపోర్టర్. ప్రజలకు నిజం చెప్పే ప్రొఫెషన్‌లో ఉన్న అతడు పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. ప్రజలు అతడ్ని అపార్థం చేసుకుంటారు.

‘అర్జున్‌ని అరెస్ట్ చెయ్యాలి’, ‘అర్జున్‌ని ఉరి తీయాలి’, ‘సమాజానికి పట్టిన చీడపురుగు అర్జున్’ అంటూ జనం నిరసనలకు దిగే దాకా పరిస్థితి వస్తుంది. ఒక ఆఫీసులో జరగకూడని దారుణం జరుగుతుంది. అందుకే ‘పోలీస్ లైన్ డు నాట్ క్రాస్’ అనే టేప్ పెడతారు పోలీసులు. అయినా రహస్యాన్ని ఛేదించడానికి అక్కడకు అర్జున్ వస్తాడు. అతడిపై దుండగులు దాడి చేస్తారు. దాంతో అక్కడి నుంచి అతడు ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తాడు.

ఎంబీఏ చదివిన అర్జున్ వెనుక ఏదైనా కథ ఉందా? అతడి కుటుంబానికేమైనా అన్యాయం జరిగిందా? ఒకవేళ జరిగితే దానికి కారకులెవరు? వాళ్లపై అర్జున్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? అసలు అర్జున్ మిషన్ ఏమిటి? వీటికి సమాధానాలు తెలియాలంటే మే 1 వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో తరుణ్ అరోరా, కిశోర్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.

‘అర్జున్ సురవరం’ను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? | actioncutok.com

You may also like: