మే 1న ‘అర్జున్ సురవరం’ రిలీజ్ కావట్లేదు!


మే 1న 'అర్జున్ సురవరం' రిలీజ్ కావట్లేదు!

మే 1న ‘అర్జున్ సురవరం’ రిలీజ్ కావట్లేదు!

నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదల వాయిదా పడింది. లావణ్యా త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని మే 1న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ అనూహ్యంగా నిర్మాతలు విడుదల వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

టి. సంతోష్ డైరెక్ట్ చేసిన ‘అర్జున్ సురవరం’ను మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మే 1న సినిమా విడుదల చేసే ఉద్దేశంతో గురువారం (ఏప్రిల్ 25) ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ వేడుకను సైతం నిర్మాతలు కేన్సిల్ చేశారు.

కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్‌లో హీరో నిఖిల్ యమ యాక్టివ్‌గా పాల్గొంటూ వస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో టీవీ 99 రిపోర్టర్‌గా కనిపించే అతను ప్రమోషన్‌లో భాగంగా టీవీ 9 రిపోర్టర్‌గా అవతారం ఎత్తి పేద ప్రజల కథలను తెలుసుకొనే ప్రయత్నం చెయ్యడం, దాన్ని విరివిగా సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యడం తెలిసిందే.

నిజానికి ఈ సినిమా 2018లోనే విడుదల కావాల్సింది. అప్పట్నుంచీ పలు సార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారైనా కచ్చితంగా విడుదలవుతుందనే ఉద్దేశంతో అగ్రెసివ్‌గా ప్రమోషన్‌లో పాల్గొంటూ వస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాపై అతడు చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ పదే పదే అతడి ఆశలపై నీళ్లు పడుతూనే ఉన్నాయి.

మే 1న ‘అర్జున్ సురవరం’ రిలీజ్ కావట్లేదు! | actioncutok.com

You may also like: