‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ నిడివి ఎంతో తెలుసా?


'అవెంజర్స్: ఎండ్ గేమ్' నిడివి ఎంతో తెలుసా?

‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ నిడివి ఎంతో తెలుసా?

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు)లోనే అత్యధిక నిడివి కలిగిన సినిమాగా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ నిలవబోతోంది. ఆ సినిమా నిడివి ఎంతో దర్శకులు రుస్సో బ్రదర్స్ వెల్లడించారు. 3 గంటల 58 నిమిషాల నిడివితో ఆ సినిమా అలరించనున్నది. టోనీ స్టార్క్ కేరెక్టర్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించగా 2008లో వచ్చిన తొలి ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో ఎంసియు సిరీస్ మొదలైంది.

ప్రపంచాన్నంతటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకొనే థానోస్‌ను సూపర్ హీరోలు ఎలా నిలువరించి, అతడిని అంతం చేశారో ‘అవెంజెర్స్: ఎండ్ గేమ్’లో మనం చూడబోతున్నాం. ‘కెప్టెన్ మార్వెల్’ సినిమాతో సరికొత్త సూపర్ హీరోగా అవతరించిన బ్రీ లార్సన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నది.

ఏప్రిల్ 26న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది. మూడు భారతీయ భాషల్లో ఈ సినిమా థీమ్ సాంగ్‌ను ఎ.ఆర్. రెహమాన్ కంపోజ్ చెయ్యడం విశేషం.

ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రఫలో, క్రిస్ హెంస్‌వర్త్, స్కార్లెట్ జొహాన్‌సన్, జెర్మీ రెన్నర్, డాన్ చియాడిల్, పాల్ రుడ్, బ్రీ లార్సన్, కరెన్ జిల్లన్, డానై గురిర, బ్రాడ్లీ కూపర్, జోష్ బ్రోలిన్ నటించారు.

‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ నిడివి ఎంతో తెలుసా? | actioncutok.com

You may also like: