3 రోజుల్లో రూ. 150 కోట్లు దాటేసింది!


3 రోజుల్లో రూ. 150 కోట్లు దాటేసింది!

3 రోజుల్లో రూ. 150 కోట్లు దాటేసింది!

ఇండియాలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కనీ వినీ ఎరుగని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. తొలి రోజు. రూ. 53 కోట్లతో సరికొత్త రికార్డ్ సృష్టించిన ఆ సినిమా రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. విడుదలకు ముందే ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల ద్వారా రూ. 65 కోట్ల నుంచి రూ. 70 కోట్ల (నెట్) దాకా రాబట్టి ఆ విధంగానూ కొత్త రికార్డు సాధించింది.

‘బాక్సాఫీస్ ఇండియా’ రిపోర్ట్స్ ప్రకారం తొలి వారాంతానికి అంటే మూడు రోజుల్లో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రూ. 150 కోట్ల మైలురాయిని దాటేసింది. తొలి రోజు మాదిరిగానే ఆదివారం కూడా ఆ సినిమా రూ. 53 కోట్లను రాబట్టింది. వెరసి మూడు రోజుల్లో సాధించిన వసూళ్లు రూ. 157.25 కోట్లకు చేరాయి.

ఆసక్తికరమైన విషయమేమంటే, గత ఏడాది విడుదలైన ‘అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్’ కంటే ఈ వసూళ్లు 67 శాతం ఎక్కువ. ఇప్పుడు సోమవారం ఈ సినిమా ఎంత వసూళ్లను సాధిస్తుందనే దానిపైనే అందరి దృష్టీ ఉంది.

రుస్సో బ్రదర్స్ – ఆంథోనీ రుస్సో, జో రుస్సో డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రుఫాలో, క్రిస్ హెమ్స్‌వర్త్, స్కార్లెట్ జొహాన్సన్, జెర్మీ రెన్నర్, బ్రీ లార్సన్, డాన్ చియాడిల్, పాల్ రుడ్, బ్రాడ్లీ కూపర్ ప్రధాన పాత్రధారులు.

3 రోజుల్లో రూ. 150 కోట్లు దాటేసింది! | actioncutok.com

Trending now: