అనుకున్నంతా అయ్యింది.. ‘అవెంజెర్స్’ అదిరిపోయే దెబ్బ కొట్టింది!


అనుకున్నంతా అయ్యింది.. 'అవెంజెర్స్' అదిరిపోయే దెబ్బ కొట్టింది!

అనుకున్నంతా అయ్యింది.. ‘అవెంజెర్స్’ అదిరిపోయే దెబ్బ కొట్టింది!

ఊహాతీతంగా కనీ వినీ ఎరుగని రీతిలో హాలీవుడ్ సినిమా ‘అవెంజెర్స్: ఎండ్ గేం’ ప్రపంచాన్నంతా ఒక ఊపు ఊపేస్తోంది. దాని ముందు అదివరకటి బాక్సాఫీస్ రికార్డులన్నీ తునాతునకలైపోతున్నాయి. సరికొత్త రికార్డులు ఆవిష్కృతమవుతున్నాయి.

ఇండియాలోనూ ‘ఎండ్ గేం’ హవా నడుస్తోంది. గత హాలీవుడ్ సినిమాల రికార్డుల్నే కాదు, భారతీయ సినిమా రికార్డుల్ని కూడా తుడిచేసి ఏకంగా మొదటి రోజు రూ. 52 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా.

ఆ సినిమా వల్ల జరిగే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన కొంతమంది నిర్మాతలు తమ సినిమాల విడుదల్ని వాయిదా వేసుకుంటే, ఒక వారం ముందు వస్తే ప్రమాదమేమీ ఉండదు కనీ అని వచ్చేసిన సినిమాలు వారం తర్వాత తమ సినిమాల పరిస్థితి చూసి బెంబేలెత్తుతున్నారు.

బాగుందని టాక్ వచ్చిన ‘జెర్సీ’ సినిమా, బి, సి సెంటర్లలో కలెక్షన్లు కురిపించిన ‘కాంచన 3’ సినిమాలకు మొదటి వారం వసూళ్లే ఊరడింపుగా నిలుస్తున్నాయి. ఆ సినిమాలు ఆడుతున్న అనేక థియేటర్లను ‘ఎండ్ గేం’ నిర్దాక్షిణ్యంగా ఆక్రమించేసింది. ఆ సినిమాకు వచ్చిన అమేయమైన క్రేజ్‌తో ఎగ్జిబిటర్లు కూడా ఆ సినిమానే తమ థియేటర్లలో ఆడాలని కోరుకుంటున్నారు.

రెండు వారాల క్రితం విడుదలై బాగుందని టాక్ వచ్చిన ‘చిత్రలహరి’ సినిమా థియేటర్ల కరువుతో విలవిల్లాడుతోంది.

అనుకున్నంతా అయ్యింది.. ‘అవెంజెర్స్’ అదిరిపోయే దెబ్బ కొట్టింది!| actioncutok.com

Trending now: