‘బాహుబలి 2’ రికార్డుని తుడిచేసిన ‘అవెంజర్స్’!


'బాహుబలి 2' రికార్డుని తుడిచేసిన 'అవెంజర్స్'!

‘బాహుబలి 2’ రికార్డుని తుడిచేసిన ‘అవెంజర్స్’!

హాలీవుడ్ మూవీ ‘అవెంజెర్స్: ఎండ్ గేమ్’ భారత్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయు)లోని ఈ తాజా సినిమా అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. రెండు రోజుల్లోనే దేశంలో రూ. 104.50 కోట్లను వసూలు చేసింది.

శుక్రవారం రూ. 53.10 కోట్లను వసూలు చేసిన ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ మునుపటి రికార్డుల్ని చెత్తబుట్టలో పడేసింది. 2019లోనే కాకుండా ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త రికార్డును సృష్టించింది. రెండో రోజు, అంటే శనివారం రూ. 51.40 కోట్లను రాబట్టి ఇదివరకు ‘బాహుబలి 2’ నెలకొల్పిన రికార్డుని తుడిచిపెట్టి, కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల మైలురాయిని దాటేసింది.

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌తో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే విడుదలైనప్పటికీ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు లభిస్తున్న స్పందన అపూర్వం. ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి 2845 స్క్రీన్లలో విడుదలైంది. వెల్లువెత్తిన డిమాండ్‌ను అందుకోవడానికి పలు థియేటర్లలో 24 గంటల పాటూ షోలు వేశారు.

‘బాహుబలి 2’ రికార్డుని తుడిచేసిన ‘అవెంజర్స్’! | actioncutok.com

Trending now: