‘బాహుబలి’ నా లైఫ్‌లో ఐకనిక్ బెంచ్‌మార్క్!


'బాహుబలి' నా లైఫ్‌లో ఐకనిక్ బెంచ్‌మార్క్!

‘బాహుబలి’ నా లైఫ్‌లో ఐకనిక్ బెంచ్‌మార్క్!

తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠల్ని దేశ యవనికపై రెపరెపలాడించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి డైరెక్షన్‌లో 2015లో వచ్చిన ఈ సినిమా అనేక రికార్డుల్ని నెలకొల్పింది. ఇక దాని రెండో భాగం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ అయితే ప్రప్రంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దానిదే రికార్డు. ఆ సినిమాతో హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజిలో పెరిగిందో, అతనికి ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే.

‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ విడుదలై నేటికి (ఏప్రిల్ 20) సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో మాట్లాడిన ప్రభాస్, ‘బాహుబలి’ సినిమా తన లైఫ్‌లో ఐకనిక్ బెంచ్‌మార్క్‌గా నిలిచిందని చెప్పాడు.

“భారతీయ సినిమా చరిత్రపై అది ప్రభావవంతమైన ఫలితాన్ని చూపించింది. దక్షిణాది నుంచి వచ్చిన సినిమాపై ప్రేక్షకులు ఇంతటి ఆదరాభిమానాల్ని ప్రదర్శించడం చాలా ఆనందాన్నిచ్చింది. రాజమౌళి గారి విజన్ ఆ సినిమాని కేవలం నేషనల్ బ్లాక్‌బస్టర్‌గానే కాకుండా గ్లోబల్ హిట్‌గా మార్చింది. పాన్ ఇండియా వేదికపై ప్రాంతీయ సినిమాకి ‘బాహుబలి’ ద్వారాలు తెరిచింది” అని చెప్పాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తయారవుతున్న ఆ సినిమాని హిందీతో పాటు దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఆ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్ట్ 15న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

‘బాహుబలి’ నా లైఫ్‌లో ఐకనిక్ బెంచ్‌మార్క్! actioncutok.com

Trending now: