బాలయ్య మళ్లీ డైరెక్టర్‌ని మార్చేశాడు!


బాలయ్య మళ్లీ డైరెక్టర్‌ని మార్చేశాడు!
Balakrishna

బాలయ్య మళ్లీ డైరెక్టర్‌ని మార్చేశాడు!

బాలకృష్ణ మరోసారి దర్శకుడ్ని మార్చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆయనతో సినిమాని కేన్సిల్ చేసుకున్నారు బాలకృష్ణ. తనకు ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ని ఇచ్చిన బోయపాటి డైరెక్షన్‌లో చేసేందుకు సిద్ధమయ్యారు.

అంతలోనే ఏమైందో గురువారం సాయంత్రానికి సీన్ మారిపోయింది. 2018 సంక్రాంతికి తనకు ‘జై సింహా’ వంటి ఓ మాదిరి విజయాన్ని అందించిన సినిమా డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్‌తో పని చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిర్మాత సి. కల్యాణ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

వాస్తవానికి గత ఏడాది బాలకృష్ణ, వినాయక్ కాంబినేషన్ సినిమాని ప్లాన్ చేసింది సి. కల్యాణే. అంటే నిర్మాత మారలేదు కానీ డైరెక్టర్ మాత్రం మారిపోయాడన్న మాట. బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్ సినిమా మే నెలలో లాంఛనంగా మొదలై, జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నది.

మరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందా? ఉంటే ఎప్పుడు? కె.ఎస్. రవికుమార్ సినిమా తర్వాత ఆయనతో చేస్తాడా?.. అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి.

బాలయ్య మళ్లీ డైరెక్టర్‌ని మార్చేశాడు! | actioncutok.com

You may also like: