బాలకృష్ణ దృష్టి సినిమాపైకి మళ్లింది!


బాలకృష్ణ దృష్టి సినిమాపైకి మళ్లింది!

బాలకృష్ణ దృష్టి సినిమాపైకి మళ్లింది!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ చేసిన బాలకృష్ణ నిశ్చింతగా ఉన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత మెజారిటీ సాధించడం ఖాయమని తన అనుయాయులతో ఆయన నమ్మకంగా చెప్తున్నారు.

ఎన్నికల తంతు ముగియడంతో రాజకీయల నుంచి సినిమాపై దృష్టి పెట్టారు. గత ఏడాది వినాయక్ డైరెక్షన్‌లో చేయడానికి నిర్ణయించిన బాలకృష్ణ, ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ తాలూకు రెండు భాగాలు ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతినడం ఆయనకు మింగుడు పడలేదు.

ఈ నేపథ్యంలో గతంలో తనకు క్లిష్ట స్థితిలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లిచ్చిన బోయపాటి మళ్లీ ఈసారీ తనకు విజయాన్ని అందిస్తాడని బాలకృష్ణ ఆశిస్తున్నారు. మరోవైపు బోయపాటి కూడా ‘వినయ విధేయ రామ’ వంటి ఫ్లాపుతో మరింత జాగ్రత్తగా స్క్రిప్టును రూపొందిస్తున్నాడు.

ఏమాత్రం లాజిక్‌కు అందని సన్నివేశాలు, మితిమించిన యాక్షన్ ఎపిసోడ్స్ వల్లే ‘వినయ విధేయ రామ’ దెబ్బతిన్నదని గుర్తించిన ఆయన ఇప్పుడు అలాంటివాటికి చోటివ్వకుండా బలమైన సన్నివేశాలతో కథను తయారు చేస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

బాలకృష్ణ దృష్టి సినిమాపైకి మళ్లింది!| actioncutok.com

You may also like: