ఆ సూపర్ స్టార్ వృద్ధుడైపోయాడు!

ఆ సూపర్ స్టార్ వృద్ధుడైపోయాడు!
‘భారత్’లో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ బయటకు వచ్చింది. ఇప్పటివరకూ ఆ సినిమాకు సంబంధించి ఈ తరహా లుక్ వెల్లడి కాలేదు. బయటకు రావడం ఆలస్యం ఓల్డ్ గెటప్‌లో సల్మాన్ ఉన్న ఆ లుక్ నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘భారత్’ జూన్ 5న రంజాన్ పర్వదినం సదర్భంగా విడుదలవుతోంది. తన లేటెస్ట్ లుక్‌ను కొన్ని గంటల క్రితం తన ట్విట్టర్ పేజీ ద్వారా సల్మాన్ రివీల్ చేశాడు. వెంటనే మన చూపుల్ని పక్కకు తిప్పుకోలేనంత ఆసక్తికరంగా ఆ లుక్ ఉండటం గమనార్హం. గెటప్ ఓల్డ్ లుక్‌తో ఉన్నా, చాలా స్టైలిష్‌గా ఉంది.
అలీ అభాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అతుల్ అగ్నిహోత్రి, అల్విరా ఖాన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నిఖిల్ నమిత్, సల్మాన్ ఖాన్ కలిసి నిర్మిస్తున్నారు.
“జితనే సఫేద్ బాల్ మేరే సర్ ఔర్ దాఢి మే హై, ఉస్సే కహీ జ్యాదా రంగీన్ మేరి జిందగి రహీ హై” (నా తల, గడ్డంలోని జుట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో, నా జీవితం అంతకంటే కలర్ఫుల్గా ఉంటుంది) అని తన కొత్త లుక్కు క్యాప్షన్ జోడించాడు సల్మాన్. పోస్టర్‌పై “జర్నీ ఆఫ్ అ మ్యాన్ అండ్ ఎ నేషన్ టుగెదర్” అని ఉండటం గమనార్హం.
ప్రస్తుతం అతను ప్రభుదేవా డైరెక్షన్లో ‘దబాంగ్ 3’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
ఆ సూపర్ స్టార్ వృద్ధుడైపోయాడు! | actioncutok.com
You may also like: