కృష్ణశాస్త్రి రచన చేసిన డాక్యుమెంటరీ


కృష్ణశాస్త్రి రచన చేసిన డాక్యుమెంటరీ
Devulapalli Krishna Sastry

కృష్ణశాస్త్రి రచన చేసిన డాక్యుమెంటరీ

సుప్రసిద్ధ సాహితీవేత్త, సినీ కవి దివంగత దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక డాక్యుమెంటరీకి రచన చేశారు. అది మహాత్మా గాంధీపై తీసిన ‘భారతవాణి’ అనే డాక్యుమెంటరీ. 1954లో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో గాంధీ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాల్ని చిత్రీకరించారు.

గాంధీ యూరప్, ఇంగ్లడ్ పర్యటనలు, రెండో రౌండ్ టేబుల్ సమావేశం, కొన్ని కాంగ్రెస్ మహాసభలు, గాంధీ అస్తమయం వంటివి ఇందులో చోటు చేసుకున్నాయి.

ఇందులోని నేపథ్య గీతాల్ని ప్రఖ్యాత గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించారు. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని గాంధీ స్మారక నిధి (మద్రాస్)కి అందించారు.

కృష్ణశాస్త్రి రచన చేసిన డాక్యుమెంటరీ | actioncutok.com

You may also like: