చెక్ బౌన్స్ కేసు: మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష


చెక్ బౌన్స్ కేసు: మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష
Mohan Babu

చెక్ బౌన్స్ కేసు: మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మోహన్‌బాకు ఏడాది జైలుశిక్ష విధించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరి పెట్టిన రూ. 40.50 లక్షల చెక్ బౌన్స్ కేసులో మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు చౌదరికి రూ. 41.75 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. జైలుశిక్ష కారణంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో మోహన్‌బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

2009లో వైవీస్ చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్‌పై మోహన్‌బాబు ‘సలీమ్’ చిత్రాన్ని నిర్మించారు. అందులో విష్ణు, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాకు సంబంధించిన పారితోషికంలో భాగంగా వైవీఎస్‌కు మోహన్‌బాబు రూ. 40.50 లక్షలకు చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కు బౌన్స్ అవడంతో 2010లో చౌదరి ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించారు.

మంగళవారం తుది విచారణ జరిపిన కోర్టు తీర్పును వెలువరించింది. మోహన్‌బాబుకు వ్యక్తిగతంగా జైలుశిక్ష విధించిన కోర్టు, ఆయన నిర్మాణ సంస్థకు రూ. 10 వేల జరిమానా విధించింది. మోహన్‌బాబు డబ్బు చెల్లించని పక్షంలో ఆయన మరో మూడు నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టి, అనంతరం వైసీపీలో చేరడం ద్వారా వార్తల్లో నిలిచిన మోహన్‌బాబు పేరు ప్రతిష్ఠలకు కోర్టు తీర్పు అశనిపాతమే.

చెక్ బౌన్స్ కేసు: మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష | actioncutok.com

You may also like: