మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెంటే.. ఆయన తప్ప!


మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెంటే.. ఆయన తప్ప!

మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెంటే.. ఆయన తప్ప!

ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చి పోటీకి దూరంగా ఉన్న జనసేన ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి రాజకీయ నాయకుడిగా ఎన్నికల బరిలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ అన్న నాగబాబు జనసేన పార్టీలో చేరి నరసాపురం పార్లమెంటు సభ్యత్వం కోసం బరిలో నిలిచారు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా జనసేనకు, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు.

రాంచరణ్, అల్లు అర్జున్ నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుకు ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. నాగబాబు కూతురు నిహారిక తండ్రికి మద్దతుగా ఒక రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది.

వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో జనసేనకు ఓటేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. ఇంతమంది పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచి, జనసేనకు ఓటెయ్యమంటూ ఓటర్లకూ, మెగాభిమానులకూ విజ్ఞప్తి చేసినా ఒక్కరు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఆయనే మెగా ఫ్యామిలీకి మూలస్తంభమైన చిరంజీవి.

జనసేనకు కానీ, పవన్ కల్యాణ్‌కు కానీ మద్దతుగా ఆయన ఇప్పటివరకూ ఒక్క మాట బహిరంగంగా మాట్లాడలేదు. ఆయన గతంలో స్వయంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి, తర్వాత రెండేళ్లకే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెంటే.. ఆయన తప్ప! | actioncutok.com

You may also like: