‘చిత్రలహరి’ వసూళ్లు: బ్రేకీవెన్ దిశగా సాయిధరం తేజ్ సినిమా


'చిత్రలహరి' వసూళ్లు: బ్రేకీవెన్ దిశగా సాయిధరం తేజ్ సినిమా

‘చిత్రలహరి’ వసూళ్లు: బ్రేకీవెన్ దిశగా సాయిధరం తేజ్ సినిమా

సాయిధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘చిత్రలహరి’ తొలి వారాంతంలో ఆశాజనక ఫలితాలు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రి రిలీజ్ బిజినెస్‌లో ఇప్పటికే దాదాపు ముప్పావు వంతు షేర్ రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 10.4 కోట్లు కాగా తొలి మూడు రోజుల్లో వసూలైన షేర్ రూ. 7.75 కోట్లు!

తెలంగాణలో రూ. 3.15 కోట్లకు గాను రూ. 2.53 కోట్ల షేర్ సాధించిన ‘చిత్రలహరి’, రాయలసీమలో 1.71 కోట్ల విలువకు గాను రూ. 1.28 కోట్లను వసూలు చేసింది. ఆంధ్రాలో విడుదలకు ముందు బిజినెస్ విలువ రూ. 5.55 కోట్లకు గాను ఇప్పటికి రూ. 3.94 కోట్ల షేర్ సాధించింది. తొలి వారం గడిచే నాటికి సినిమా బ్రేకీవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వరుసగా 6 సినిమాలు ఫ్లాపవడంతో బిజినెస్ వర్గాల్ని ‘చిత్రలహరి’ ఎక్కువగా ఆకర్షించలేకపోయింది. అందుకే అతి తక్కువ ధరకు వివిధ ఏరియాల హక్కులు అమ్ముడయ్యాయి. దానివల్ల సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం లభించింది.

‘చిత్రలహరి’లో తేజ్ సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు.

‘చిత్రలహరి’ వసూళ్లు: బ్రేకీవెన్ దిశగా సాయిధరం తేజ్ సినిమా | actioncutok.com

You may also like: