చుల్‌బుల్ పాండే వచ్చే తేదీ అదే!


చుల్‌బుల్ పాండే వచ్చే తేదీ అదే!

చుల్‌బుల్ పాండే వచ్చే తేదీ అదే!

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నది. బహుశా కరణ్ జోహార్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’తో అది బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం కనిపిస్తోంది.

తనదైన శైలిలో ‘దబాంగ్ 3’ విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు సల్మాన్. ‘చుల్‌బుల్ పాండే’ అనే బ్యాడ్జ్‌తో పోలీస్ యూనిఫాం వేసుకున్న కత్తిరించిన తన ఫొటోను షేర్ చేస్తూ “చుల్‌బుల్ ఈజ్ బ్యాక్.. దబాంగ్ 3” అని పోస్ట్ చేశాడు.

‘దబాంగ్’ సిరీస్‌లో ఆయన పేరు చుల్‌బుల్ పాండే. ఆ పేరు బాగా ఫేమస్ కావడం గమనార్హం. సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. ‘వాంటెడ్’ తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే.

యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాల్లో జరుగుతోంది.

చుల్‌బుల్ పాండే వచ్చే తేదీ అదే! actioncutok.com

You may also like: