‘డియర్ కామ్రేడ్’ పోటీ నుంచి తప్పుకున్నాడు!


'డియర్ కామ్రేడ్' పోటీ నుంచి తప్పుకున్నాడు!

‘డియర్ కామ్రేడ్’ పోటీ నుంచి తప్పుకున్నాడు!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘డియర్ కామ్రేడ్’ ప్రకటించినట్లుగా మే 31న రావట్లేదని సమాచారం. రష్మికా మండన్న నాయికగా నటించిన ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. విజయ్‌కు కొన్ని సీన్లు నచ్చకపోవడంతో వాటిని రిషూట్ కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక పాట విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. మే 9 విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని రెండో పాటను విడుదల చేయనున్నారు.

‘డియర్ కామ్రేడ్’ను దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మే 31న సూర్య సినిమా ‘ఎన్‌జీకే’ విడుదలవుతుండటంతో దానితో పోటీపడే బదులు మరో సరైన తేదీన విడుదల చేయడం మంచిదని నిర్మాతలు భావించారు. అందుకే విడుదలను వాయిదా వేశారు.

అలా అని సినిమా జూన్‌లోనూ విడుదల కాదనీ, జూలైలో విడుదల చేస్తే బాగుంటుందనీ నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. జూలై 19న విడుదల చేసే ఆలోచనలో వాళ్లు ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చింది. వాళ్ల నుంచి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నది.

'డియర్ కామ్రేడ్' పోటీ నుంచి తప్పుకున్నాడు!

‘డియర్ కామ్రేడ్’ పోటీ నుంచి తప్పుకున్నాడు! | actioncutok.com

Trending now: