అబ్బే.. దేవి మ్యూజిక్‌లో మెరుపులేవీ?


అబ్బే.. దేవి మ్యూజిక్‌లో మెరుపులేవీ?

అబ్బే.. దేవి మ్యూజిక్‌లో మెరుపులేవీ?

నిన్నటి వరకు తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎక్కవ మంది దేవి శ్రీప్రసాద్ పేరే చెప్పేవాళ్లు. ఇప్పుడు? ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దేవి మ్యూజిక్‌కు తిరుగులేదు అనే నమ్మకం సడలిపోతోంది. రెండేళ్లుగా దేవి సంగీతంలో మెరుపులేవీ కనిపించడం లేదని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

టాప్ హీరోల సినిమాలకు ఒక రకంగా, ఒక మోస్తరు హీరోల సినిమాలకు ఇంకో రకంగా బాణీలు అందించే సంగీత దర్శకుడిగా దేవిపై ఒక ముద్ర ఉంది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుంటున్నాడు దేవి. ఏ సినిమాకైనా అతని సంగీతం ఒకే రకంగా వినిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ సంగీతంలో చెప్పుకోడానికి ఏమీ ఉండట్లేదనేది వాళ్ల మాట.

తాజాగా మహేశ్ సినిమా ‘మహర్షి’ని తీసుకుంటే, ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలూ సంగీతప్రియులనే కాదు, మహేశ్ అభిమానుల్ని సైతం నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండో పాట ‘నువ్వే సమస్తం’ అతి సాదాసీదాగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో దానికి ఆదరణ అంచనాలకు చాలా దూరంలో ఉండటం గమనార్హం.

ఆదిత్యా మ్యూజిక్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ఈ సాంగ్‌కు మూడు రోజుల్లో వచ్చిన వ్యూస్ 2 మిలియన్లను కూడా చేరుకోలేకపోవడం ఆ పాట ఎంతగా సంగీత ప్రియుల్ని అసంతృప్తికి గురి చేసిందనేందుకు నిదర్శనం.

అదివరకు విడుదల చేసిన ‘చోటీ చోటీ బాతే’ పాట 18 రోజుల్లో సాధించిన వ్యూస్ 5.78 మిలియన్లు (ఇది రాసే సమయానికి) మాత్రమే. ఈ లెక్కన మిలిగిన పాటలైనా జనాదరణ పొందుతాయా.. అనే సందేహం వ్యక్తమవుతోంది.

కాగా నాలుగు రోజుల క్రితం విడుదలైన సాయిధరం తేజ్ సినిమా ‘చిత్రలహరి’ మ్యూజిక్ కూడా ఏమంత వినసొంపుగా లేదనే మాట వినిపిస్తోంది. ‘గ్లాస్‌మేట్స్’ పాట బాణీలు మాత్రమే బాగున్నాయనీ, మిగతా పాటల్లో చెప్పుకోడానికేమీ లేదనీ అంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దేవి మ్యూజిక్ ఇటీవలి కాలంలో చాలా సాదాసీదాగా ఉంటోందనీ, అందుకే తెలుగులో ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులు ఎక్కువగా అవకాశాలు పొందుతున్నారనీ అభిప్రాయపడుతున్నారు.

అబ్బే.. దేవి మ్యూజిక్‌లో మెరుపులేవీ? | actioncutok.com

You may also like: